Bengaluru: హాస్టల్‌లో ఉన్న కొడుకు అమ్మానాన్నకు కాల్ చేయగా ఇద్దరి ఫోన్లూ స్విచ్ ఆఫ్.. ఏమైందా అని ఇంటికొచ్చి చూస్తే..

గాంధీ, షాలినీ

మనుషుల్లో రోజురోజుకూ చావు భయం కన్నా బతకాలంటే భయం పెరిగిపోతోంది. కొందరికి కుటుంబ సమస్యలు, మరికొందరికి ఆర్థిక కష్టాలు, ఇంకొందరికి అనారోగ్య సమస్యలు. ఇలా కారణం ఏదైనా సమస్యలతో ఎదిరించి పోరాడలేక అర్థాంతరంగా తనువు చాలిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.

  • Share this:
    బెంగళూరు: మనుషుల్లో రోజురోజుకూ చావు భయం కన్నా బతకాలంటే భయం పెరిగిపోతోంది. కొందరికి కుటుంబ సమస్యలు, మరికొందరికి ఆర్థిక కష్టాలు, ఇంకొందరికి అనారోగ్య సమస్యలు. ఇలా కారణం ఏదైనా సమస్యలతో ఎదిరించి పోరాడలేక అర్థాంతరంగా తనువు చాలిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా.. బెంగళూరు నగరంలో ఓ కుటుంబం కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. ఇంట్లో వెతకగా.. కిటికీ వద్ద ఒక సూసైడ్ నోట్ కనిపించింది. ‘మాకు ఈ బతుకు బతకాలని లేదు. దయచేసి మమ్మల్ని చనిపోనివ్వండి’ అని ఆంగ్లంలో లేఖలో రాసి ఉంది.

    పోలీసులు ప్రస్తుతం ఈ మిస్సింగ్ ఫ్యామిలీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గాంధీ, షాలినీ భార్యాభర్తలు. ఈ దంపతులకు భానుశ్రీ, హేమశ్రీ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొడుకు చిరంజీవి తుమకూరులో చదువుకుంటూ అక్కడే హాస్టల్‌లో ఉండేవాడు. రోజూ.. ఫోన్ చేసి అమ్మానాన్నలతో మాట్లాడేవాడు. ఆగస్ట్ 12న కూడా రోజూలానే ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్‌కు చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. తల్లి దగ్గరున్న ఫోన్‌కు చేస్తే ఆ నంబర్ కూడా స్విచాఫ్ వచ్చింది. దీంతో.. చిరంజీవికి కంగారు మొదలైంది. ఏమైందో.. ఏంటోనని తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఫ్రెండ్‌కు ఫోన్ చేసి.. అమ్మానాన్న ఫోన్లు రెండూ స్విచాఫ్ వస్తున్నాయని.. తనకెందుకో భయంగా ఉందని చెప్పాడు. తన ఫ్రెండ్ ఇంటికెళ్లి చూసేసరికి.. తాళం వేసి కనిపించింది.

    ఇది కూడా చదవండి: Tragedy: సూసైడ్ నోట్ రాసి.. పక్కనే లక్ష రూపాయలు డబ్బు ఉంచి ఆత్మహత్య.. ఆ లక్ష గురించి ఏం రాశారంటే..

    అద్దె ఇల్లు కావడంతో ఆ కుటుంబం ఎక్కడికి వెళ్లారని ఓనర్లను అడగ్గా.. వస్తువులన్నింటినీ తీసుకుని కుటుంబం మొత్తం ఎక్కడికో వెళ్లారని చెప్పారు. తన ఫ్రెండ్ చిరంజీవికి విషయం చెప్పడంతో అతను హుటాహుటిన బాగలకుంటెలోని ఇంటికి చేరుకున్నాడు. తన దగ్గర ఉన్న మరో ఇంటి తాళం చెవితో తాళం తీశాడు. తలుపులు తీసి చూడగా.. కిటికీ దగ్గర సూసైడ్ నోట్ కనిపించింది. తమకు బతకాలని లేదని.. కష్టంగా ఉందని.. దయచేసి చనిపోనివ్వాలని అందులో రాసి ఉంది. దీంతో.. చిరంజీవి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనిపించకుండా పోయిన ఆ నలుగురి కోసం గాలిస్తున్నారు. ఆ కుటుంబం కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఆ మనస్తాపంతోనే ఇలా చనిపోవాలని నిర్ణయించుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: