ఏకంగా బస్టాప్ నే ఎత్తుకెళ్లిన దొంగలు.. పట్టిస్తే రూ.5 వేల బహుమతి.. ఎక్కడంటే..

పూణే మహానగరంలో ఇటీవల ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. కొందరు దొంగలు ఏకంగా బస్టాప్ నే ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది.

news18-telugu
Updated: October 22, 2020, 2:15 PM IST
ఏకంగా బస్టాప్ నే ఎత్తుకెళ్లిన దొంగలు.. పట్టిస్తే రూ.5 వేల బహుమతి.. ఎక్కడంటే..
దొంగతనం జరిగిన బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
  • Share this:
వాహనాలు, ఇతర వస్తువులు, బంగారం, డబ్బుల దొంగతానికి గురైన వార్తలు మనం నిత్యం వింటూనే ఉంటాం. ఆ మధ్య ఒకరు ఏకంగా హైదరాబాద్ నుంచి సీటీ బస్సును కూడా ఎత్తుకెళ్లారు. అయితే పూణే మహానగరంలో ఇటీవల ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. కొందరు దొంగలు ఏకంగా బస్టాప్ నే ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది. అది ఎత్తుకెళ్లింది ఎవరో గుర్తించడం స్థానిక పోలీసులు, అధికారులకు సవాల్ గా మారింది. రోడ్డు పక్కన ఉండే బస్టాప్ ఎత్తుకెళ్లడం కాదన్న అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిజంగానే దొంగతనం చేశారా.. లేకుండా అక్కడ బస్టాప్ లేకుండా చేయాలని ఇలా చేశారా? అన్న విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల ప్రకారం.. పూణె మహానగర్‌ పరివహన్‌ ప్రజల కోసం దేవాకి ప్యాలెస్‌ ఎదుట బీటీ కవాడే ఓ బస్ స్టాప్ ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఆ బస్టాప్ ను కొందరు ఎత్తుకెళ్లారు.

అయితే ఈ కరోనా నేపథ్యంలో ఎవరూ పెద్దగా బయటకు రాకపోవడంతో ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరు ఈ విషయాన్ని షేర్‌ చేయడంతో బస్టాప్ దొంగతనం జరిగిన విషయం బయటకు వచ్చింది.  ఈ విషయంపై స్పందించిన మాజీ ఎన్సీపీ కార్పొరేటర్ ప్రశాంత్ బస్టాప్ ఎత్తుకెళ్లిన వారిని గుర్తిస్తే రూ. 5 వేల బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు బస్టాప్ ఏర్పాటు చేసిన స్థలంలో ఫ్లెక్సీ సైతం ఏర్పాటు చేశారు. దీంతో అందరూ దాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక మంది వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కావాలనే కొందరు ఇలా చేసి ఉంటారని కొందరు కామెంట్ చేయగా.. బస్టాప్ నిర్మాణాన్ని ముక్కలుగా చేసి పాత ఇనుప సామాను వాడికి అమ్మేసుకున్నారేమో అంటూ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. దీని గురించి రెడిట్‌లో ఓ వ్యక్తి పోస్ట్‌ చేశారు. ఈ ఘటన గురించి తాను వీధి వ్యాపారులను అడిగినట్లు చెప్పారు. పగటి సమయంలో ఇలాంటి దొంగతనమేదీ జరగలేదని వారు తెలిపినట్లు అతను చెప్పాడు.
Published by: Nikhil Kumar S
First published: October 22, 2020, 2:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading