Home /News /crime /

ENGINEERS WIFE DENIES AFFAIR WITH DRIVER CALLS HIM BROTHER PVN

Extramarital Affair : డ్రైవర్ తో వివాహేతర సంబంధం..భర్తను చంపేందుకు ఫ్లాన్..అయితే!

భర్తను చంపేందుకు ఫ్లాన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య

భర్తను చంపేందుకు ఫ్లాన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య

Engineer wife denies affair with driver : మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండాల్సిన భార్యభర్తల బంధం బీటలువారుతోంది. మూడో వ్యక్తి ఆకర్షణలో పడుతున్న భార్యలు లేదా భర్తలు.. ప్రాణాలు తృణప్రాయంగా తీసేస్తున్నారు. అయితే ఇటీవల ఒడిషాలో ఓ ఇంజినీర్ భార్య.. తన డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని..తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు అవుతాడని కాంట్రాక్ట్ కిల్లర్ ద్వారా అతడిని చంపిడానికి ఫ్లాన్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
Engineer wife denies affair with driver : మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండాల్సిన భార్యభర్తల బంధం బీటలువారుతోంది. మూడో వ్యక్తి ఆకర్షణలో పడుతున్న భార్యలు లేదా భర్తలు.. ప్రాణాలు తృణప్రాయంగా తీసేస్తున్నారు. అయితే ఇటీవల ఒడిషాలో ఓ ఇంజినీర్ భార్య.. తన డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని..తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు అవుతాడని కాంట్రాక్ట్ కిల్లర్ ద్వారా అతడిని చంపిడానికి ఫ్లాన్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆ మహిళ..అసలు తనకు డ్రైవర్ తో వివాహేతర సంబంధం లేదని..తన భర్తకే చాలా మంద అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని సంచలన విషయాలు వెల్లడించింది.

ఒడిషా రాష్ట్రానికి చెందిన శిల్సిలా అనే మహిళకు కొన్నేళ్ల క్రితం బినాయక్ బెహ్రా అనే ఓ ఇంజినీర్ తో వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీనికి కారణం వివాహేతర సంబంధం అనుమానం. ఈ క్రమంలో 2020 నుంచి భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. వీరిద్దరిని కలిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఎంత ప్రయత్నించినా పలితం లభించలేదు. అయితే ఈ క్రమంలో తాజాగా ఇంజినీర్ అయిన బినాయక్ బెహ్రాపై హత్యాయత్నం జరిగింది. దీనిపై బినాయక్ మంచేశ్వర్ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చాడు. తన భార్యకు,తన డ్రైవర్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని..అందుకే ఆమె తనను చంపేందుకు కుట్ర చేసినట్లు అతడు ఆరోపించాడు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొనబడిన శిల్సిలా తాజాగా మీడియా ముందుకొచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని,తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ తప్పు అని నిరూపిస్తానని పేర్కొంది.

ALSO READ Viral : స్కూల్ రూమ్ లోనే రోజూ ప్రిన్సిపాల్ రాసలీలు..వీడియో వైరల్..చివరికి

తాను భర్తను చంపేందుకు ఏ కాంట్రాక్ట్ కిల్లర్ కి సుఫారీ ఇవ్వలేదని పేర్కొంది. మంచేశ్వర్ పోలీసులు ఇప్పటివరకు తనను ఈ కేసు విషయమై కాంటాక్ట్ అవ్వలేదని తెలిపారు. తనను తన భర్త బినాయక్ బెహ్రా,స్థానిక పోలీస్ ఒకరు ట్రాప్ చేశారని ఆమె ఆరోపించారు. తన భర్తుే అశోక్ కుమార్ అనే వ్యక్తిని డ్రైవర్ గా నియమించాడని..అశోక్ తనకు సోదరుడు లాంటి వాడని శిల్సిలా తెలిపింది. తన భర్తకు అనేకమంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని,అతనికి తనతో,పిల్లలో ఉండటం ఇష్టం లేకనే అతడు తనపై నిరాధార ఆరోపణలు చేశాడని శిల్సిలా తెలిపింది.

ALSO READ HIV : కండోమ్స్ కొనకుండా కక్కుర్తి..ఎయిడ్స్ కేసుల్లో మన రాష్ట్రమే నెంబర్-1

కాగా, స్థానిక పోలీసులు శుక్రవారం ఈ కేసులో కారు డ్రైవర్ అశోక్ ని అరెస్ట్ చేశారు. ఇంజినీర్ భార్య,ఆమె డ్రైవర్,జితేంత్ర అనే కాంట్రాక్ట్ కిల్లర్ మధ్య..ఇంజినీర్ బినాయక్ బెహ్రాని చంపేందుకు రూ.1లక్ష డీల్ కుదిరిందని స్థానిక పోలీసుల సమాచారం. బినాయక్ బెహ్రా గతంలో మంచేశ్వర్ లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే(ECoR)లో ఎలక్ట్రికల్ ఇంజినీర్ గా పనిచేసేవాడు. ఇటీవల ఆయన పూరీలోని ECoR ఆఫీస్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. ఈ సమయంలోనే డ్రైవర్ కు తన భార్యతో సంబంధం మరింత దగ్గరయ్యిందని బినాయక్ తెలిపాడు. ఈ క్రమంలోనే ఓ ఐరన్ రాడ్ తో తనను కొట్టి చంపించేందుకు డ్రైవర్ తో కలిసి తన భార్య ఫ్లాన్ చేసిందని బినాయక్ ఆరోపించాడు. ఈ విషయమై మంచేశ్వర్ పోలీస్ స్టేషన్ లో బినాయక్ కంప్లెయింట్ చేయగా..దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీపుటేజి ఆధారంగా డ్రైవర్ అశోక్ ని అదుపులోకి తీసుకున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Extra marital affair, Odisha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు