Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసి హత్య

    విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి ప్రవర్తించాడు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

    news18-telugu
    Updated: October 15, 2020, 1:45 PM IST
    విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసి హత్య
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి ప్రవర్తించాడు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తనను తాను కత్తితో గాయపరుచుకున్నాడు. నిందితుడిని 24 ఏళ్ల  పి స్వామిగా గుర్తించారు. వివరాలు.. మాచవరం పోలీసు స్టేషన్‌ పరిధిలోని క్రీస్తురాజుపురంలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువతిని స్థానికంగా ఉండే స్వామి అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమ పేరిట వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే స్వామి  ప్రేమను ఆమె నిరాకరించింది. ఇలాగే వేధింపులకు గురిచేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.

    తన ప్రేమను అంగీకరించకపోవడంతో స్వామి ఆ యువతిపై కక్ష గట్టాడు. గురువారం యువతి ఇంటికి వెళ్లిన స్వామి ఆమెపై కత్తితో దాడి చేశాడు. స్వామి దాడిలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రితో చికిత్స పొందుతూ బాధిత యువతి మృతి చెందింది.

    ఇక, యువతిపై కత్తితో దాడి చేసిన స్వామి.. అనంతరం తనను తాను గాయపరుచుకున్నాడు. దీంతో అతన్ని కూడా చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆ ప్రేమోన్మాది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
    Published by: Sumanth Kanukula
    First published: October 15, 2020, 1:45 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading