Home /News /crime /

ENGINEERING GIRL STUDENT CHANDRIKA COMMIT SUICIDE IN HOSTEL AFTER MIDNIGHT IN MEDCHAL FULL DETAILS HERE HSN

ఉమెన్స్ హాస్టల్ లో దారుణం.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బీటెక్ యువతి గది నుంచి బయటకు వచ్చి మరీ..

చంద్రిక (ఫైల్ ఫొటో)

చంద్రిక (ఫైల్ ఫొటో)

చంద్రిక బీటెక్ నాలుగో ఏడాదికి సంబంధించిన పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఆమెది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఫిబ్రవరి నాలుగో తారీఖున సొంతూరి నుంచి కాలేజీకి వచ్చింది. అయితే..

    మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మరికొద్ది రోజుల్లో బీటెక్ పూర్తయిపోతుందనగా ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. సొంతూరి నుంచి ప్రత్యేకంగా పరీక్షల కోసమే సిటీకి వచ్చి హాస్టల్ లో నివసిస్తున్న ఆ యువతి మంగళవారం ఉదయం నిర్జీవంగా పడి ఉంది. హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చంద్రిక అనే విద్యార్థిని చదువుతోంది. ప్రస్తుతం చంద్రిక బీటెక్ నాలుగో ఏడాదికి సంబంధించిన పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఆమెది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఫిబ్రవరి నాలుగో తారీఖున సొంతూరి నుంచి కాలేజీకి వచ్చింది.

    కాలేజీకి దగ్గరలో ఉండే కృపా ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. హాస్టల్ లో ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. త్వరలోనే పరీక్షలు రాసి ఇంటికి వెళ్తానని స్నేహితులతో చెప్పేదట. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం హాస్టల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆ మృతదేహం చంద్రికదేనని హాస్టల్ నిర్వాహకులు తేల్చారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. హాస్టల్ పై నుంచి దూకే చంద్రిక ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తించారు. సీసీ కెమెరాలో కూడా ఈ ఘటన నమోదయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె తన గది నుంచి బయటకు వచ్చి, కిందకు దూకిన వీడియోను పోలీసులు గుర్తించారు.
    ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..

    ఘటన నిమిత్తమై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. చదువులో వెనకబడ్డానన్న కారణంతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కొన్ని బ్యాక్ లాగ్స్ ఉన్నాయనీ, వాటిని పాస్ అవుతానో లేదోనన్న భయంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటుందనుకుంటున్నారు. చంద్రిక ఆత్మహత్య గురించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒక రోజుకు ముందు వరకు తమతో కలిసి మెలసి ఉన్న యువతి, ఇలా ఆత్మహత్యకు పాల్పడటాన్ని స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు. ఆమె అందరితోనూ కలిసి మెలిసి ఉండేదనీ, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తెలియడం లేదని వారు వాపోతున్నారు.
    ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Love affair, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు