Home /News /crime /

ENGINEERING FOR RS 75000 LAW CERTIFICATE FOR RS 2 LAKH HOW THE FAKE DEGREE MARKET FLOURISHES BS

News18 Exclusive: పైసలిస్తే చాలు.. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా..

నకిలీ సర్టిఫికెట్లు

నకిలీ సర్టిఫికెట్లు

News18 Exclusive: యూనివర్సిటీలో అడుగు పెట్టకుండానే, క్లాసులకు హాజరు కాకుండానే, ఏ సంవత్సరం అయినా సరే.. సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఏంజెట్లు కోకొల్లుగా పుట్టుకొస్తున్నారు. ‘న్యూస్18’ ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో దేశంలోని పలు విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో జరుగుతున్న బాగోతలు బట్టబయలయ్యాయి.

ఇంకా చదవండి ...
ఏ డిగ్రీ పట్టా కావాలన్నా.. అది ఏ యూనివర్సిటీది అయినా సరే.. పైసలు చేతిలో పెడితే చాలు.. కూర్చున్నకాడికి పట్టా వచ్చి చేరుతుంది. చదువుతో పనిలేదు.. పైసలతోనే పని. రూ.75 వేల నుంచి రూ.2 లక్షల దాకా ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు.. ఇంజనీరింగ్ సర్టిఫికెట్ కావాలంటే రూ.75 వేలు.. లా పట్టా కావాలంటే రూ.2 లక్షలు. ఇలా దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్ల దందా జోరుగా కొనసాగుతోంది. యూనివర్సిటీలో అడుగు పెట్టకుండానే, క్లాసులకు హాజరు కాకుండానే, ఏ సంవత్సరం అయినా సరే.. సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఏంజెట్లు కోకొల్లుగా పుట్టుకొస్తున్నారు. ‘న్యూస్18’ ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో దేశంలోని పలు విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో జరుగుతున్న బాగోతలు బట్టబయలయ్యాయి. కలుగులో దాక్కున్న ఎలుకను బయటకు లాగే మాదిరిగా మా రిపోర్టర్ల బృందం కొందరు ఏజెంట్లను కలిసి నకిలీ సర్టిఫికెట్ల గురించి ఆరా తీసింది. నవీ ముంబైలో ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కింద ఏజెంట్‌గా పనిచేస్తున్న స్వప్నిల్ గైక్వాడ్ అనే వ్యక్తిని కలవగా.. 2016కు సంబంధించి బీఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించాడు.

యశ్వంత్‌రావ్ చౌహాన్ యూనివర్సిటీ, సోలాపూర్ యూనివర్సిటీ.. ఇంకా కొన్ని వర్సిటీల పేర్లు చెప్పి ఆయా వర్సిటీల నుంచి పట్టా ఇస్తామని చెప్పాడు. చేతికి సర్టిఫికెట్లు రావడానికి 45 రోజులు పడుతుందని.. తొలుత 30 రోజుల్లో స్కానింగ్ కాపీలు అందజేస్తామని, మరో 15 రోజుల్లో హార్డ్ కాపీలు అందజేస్తామని తెలిపాడు. అంతేకాదు.. సర్టిఫికెట్ల వివరాలను యూనివర్సిటీ రికార్డుల్లో చేర్చడానికే ఎక్కువ సమయం పడుతుందనీ వెల్లడించాడు.

మరి, వెరిఫికేషన్‌ అప్పుడు దొరికిపోతే ఎలా అని అడిగితే.. అవి ఒరిజినల్ డిగ్రీలు అని, వెరిఫికేషన్‌ కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చని వివరించాడు. పీహెచ్‌డీ పట్టా కావాలంటే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఇస్తామని, కావాలంటే.. థీసిస్, సినాప్సిస్ కూడా ప్రొవైడ్ చేస్తామని పేర్కొనడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీ నుంచి లా సర్టిఫికెట్ కావాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని చెప్పాడు స్వప్నిల్.

యూనివర్సిటీ అధికారులకు ఈ విషయం తెలీదా అని అడిగితే.. కొన్ని యూనివర్సిటీలు కఠినంగా వ్యవహరిస్తాయని, కానీ, కొన్ని యూనివర్సిటీలు అంతగా పట్టించుకోవని.. వాటిని విధించే లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇలా తప్పుదారి పడుతున్నాయని అతడు స్పష్టంగా విడమర్చి చెప్పడం విశేషం. ఈ వ్యవహారంపై కేంద్ర మానవ వనరుల శాఖను సంప్రదించగా.. ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.
First published:

Tags: Fake degrees, News18

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు