Home /News /crime /

ENGAGEMENT WITH ONE GIRL MARRIAGE WITH ANOTHER GIRL LEADS TO FILED CASE AGAINST CRPF JAWAN IN KURNOOL DISTRICT HSN

Kurnool: మూడు నెలల క్రితం నిశ్చితార్థం.. యువకుడి నుంచి యువతికి నో ఫోన్ కాల్స్.. అసలు కథేంటా అని అరా తీస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ సీఆర్పీఎఫ్ జవాన్ కు ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. మూడు నెలల క్రితం ఆమెతో నిశ్చితార్థం జరిగినా కనీసం ఫోన్ కూడా చేయలేదు. విషయం ఏంటా అని ఆరా తీస్తే..

    ఓ యువకుడితో ఆ యువతికి నిశ్చితార్థం జరిగింది. పెళ్లిచూపుల్లో నచ్చడమే కాకుండా పెద్దలు కూడా మంచి సంబంధం అంటూ మాట్లాడుకుంటుండటంతో మరింత మురిసిపోయింది. ఆ యువకుడితో తన జీవితం గురించి ఎన్నో కలలు కంది. భవిష్యత్ గురించి ఎన్నో ఆలోచనలు చేసింది. నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తున్నా ఆ కుర్రాడు తనకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేయకపోవడం గురించి కాస్త అనుమానపడింది. ఉద్యోగ రీత్యా పనిలో ఉన్నాడేమోనని తనను తాను సర్దిచెప్పుకుంది. కానీ ఊహించని రీతిలో ఆమెకు షాక్ తగిలింది. తన కూతురితో నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తికి అప్పటికే పెళ్లయిపోయిందని, వేరే యువతిని పెళ్లాడాడని ఆ తండ్రికి తెలిసింది. దీంతో యువతి తంత్రి అతడిపై కేసు నమోదు చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గుంపరమానిదెన్నె గ్రామానికి చెందిన బత్తుల పుల్లయ్య కుమారుడు మధుభాస్కర్ అనే యువకుడు జమ్మూకశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మహానంది మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో అతడికి నిశ్చితార్థం చేశారు. కట్నకానుకలు కూడా ముందే మాట్లాడుకున్నారు. 7.50 లక్షల రూపాయల కట్నం ఇచ్చేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. జనవరి 16వ తేదీన వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగినా మధుభాస్కర్, ఆ యువతికి ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం లాంటివి ఏమీ చేయలేదు.
    ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

    విధి నిర్వహణ కారణంగా బిజీగా ఉండి ఉంటాడని భావించింది. కానీ నెలలు గడుస్తున్నా యువకుడి కుటుంబం నుంచి ఏమాత్రం సంప్రదింపులు లేకపోవడంతో యువతి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ విషయమై యువకుడి ఊళ్లో ఆరా తీశారు. అయితే అతడికి ఏప్రిల్ 15వ తారీఖున బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన యువతితో పెళ్లయిందని ఆ యువతి తండ్రికి తెలిసింది. నిశ్చితార్థం చేసుకుని మరీ మోసం చేయడం ఏంటని యువతి బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. అదనపు కట్నం కోసం ఆశపడి మధుభాస్కర్ మరో యువతిని పెళ్లాడాడని గ్రహించారు. దీంతో మధుభాస్కర్ పై, అతడి తండ్రి పుల్లయ్యపై యువతి తండ్రి మహానంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Kurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు