Home /News /crime /

ENDANGERED GREAT INDIAN HORNBILL BIRD BRUTALLY BEATEN TO DEATH IN NAGALAND NETIZENS FIRES OVER INCIDENT VIDEO GOES VIRAL PAH

రాష్ట్ర పండుగగా జరుపుకునే పక్షికి ఘోర అవమానం.. కర్రలతో కొడుతూ.. కాలితో తొక్కుతూ..

పక్షిని చిత్రహింసలు పెడుతున్న వ్యక్తి

పక్షిని చిత్రహింసలు పెడుతున్న వ్యక్తి

Nagaland:ముగ్గురు వ్యక్తులు పశువుల కన్నా హీనంగా ప్రవర్తించారు. నడి రోడ్డుమీద నోరులేని జీవిపట్ల అమానుషంగా వ్యవహరించారు. హర్న్ బిల్ పక్షిని పట్టుకుని ఇష్టమోచ్చినట్లు కొడుతూ, క్రూరంగా ప్రవర్తించారు.

కొందరు వ్యక్తులు నీచంగా ప్రవర్తిస్తుంటారు. వీరి కన్నా.. నోరులేని మూగ జీవాలే నయం అనిపిస్తుంటుంది. అవి సాటి జీవులను హింసించవు. కానీ సమాజంలో కొందరు నీచులు.. మనుషులనే కాదు. మూగజీవాలను వదిలిపెట్టడం లేదు. వాటిని చిత్రహింసలకు గురిచేస్తుంటారు. ఇప్పటికే కొందరు సర్కస్ లో కొన్ని జీవులను ఇష్టమోచ్చినట్లు కొడుతుంటారు. వాటిని కర్రలతో షాక్ ఇస్తుంటారు. రింగ్ మాస్టర్ లు చెప్పినట్లు చేయకపోతే.. వాటికి సరైన ఆహరం కూడా ఇవ్వరు.

మన చుట్టు పక్కల కూడా కొందరు ఆవులు, ఎద్దులు, ఇతర జీవులను చిత్రహింసలకు గురిచేస్తుంటారు. మరికొందరు కొన్ని సార్లు.. అడవిలోని ఏదైన జంతువు పొరపాటున.. మనుషుల ఆవాసాలకు వచ్చిదంటే.. వాటికి చిత్రహింసలు పెట్టి పైశాచికానందం పొందుతారు. ఇలాంటి షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.






పూర్తి వివరాలు.. నాగాలాండ్ లో (Nagaland)  అత్యంత కిరాతక సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు వోఖా అనే ప్రాంతంలో అరుదైన గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్ పక్షి (Indian Hornbill Bird Brutally Beaten to Death)  పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. పక్షిని నడిరోడ్డుమీద పడేసి.. వాటి రెక్కలను చాచి.. కర్రలతో కొట్టారు. అది బాధతో అరుస్తున్న దాన్ని వదల్లేదు. దాని మెడ మీద కాలు పెట్టి, నలిపేశారు. పాపం.. పక్షి బాధతో విల విల్లాడుతున్న ఏ ఒక్కరు వారిని వారించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (Viral video)  మారింది. ఘటనపై ఫారెస్టు అధికారులు సీరియస్ అయ్యారు.



నాగాలాండ్ లో గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అలాంటి చోట.. అదే పక్షిని కొందరు అత్యంత కిరాతకంగా ప్రవర్తిండంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే ముగ్గురుని అరెస్టు చేశారు. కాగా , ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN).. గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్ పక్షిని అంతరించిపోతున్న జీవుల జాతుల్లో చేర్చి.. వాటిని కాపాడటానికి చర్యలు తీసుకుంటుంది. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు మనుషులేనా అని కామెంట్ లు చేస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Birds, Nagaland, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు