ఏఓబీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

కొన్ని రోజుల క్రితం కీలక దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, మరికొందరు తప్పించుకున్నట్టు ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: October 12, 2018, 4:27 PM IST
ఏఓబీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మహిళా మావోయిస్టు
  • Share this:
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఏపీ, ఒడిశాకు చెందిన స్పెషల్ భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ దాడిలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఏఓబీలోని బెజ్జంగి - పనసపుట్టి సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా ఆండ్రపల్లి సమీపంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. వారిలో ఒకరు మహిళా మావోయిస్టు. ఇద్దరూ దళంలో కీలక సభ్యులని బలగాలు చెబుతున్నాయి.

ఈ కాల్పుల్లో చనిపోయిన మహిళా మావోయిస్ట్‌ను నిడిగొండ ప్రమీల అలియాస్ మీనా అలియాస్ జిలాని బేగంగా పోలీసులు గుర్తించారు. మృతురాలు మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ భార్య అని పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రమీల స్వస్థలం బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట. ప్రస్తుతం ఏఓబీ లో డిస్ట్రిక్ట్ కమిటీ మెంబెర్ (డీసీఎం)గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు చంపిన తర్వాత పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఏవోబీలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కీలక దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, మరికొందరు తప్పించుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు.

First published: October 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>