Beer Psycho: బెడ్రూం నిండా ఖాళీ బీర్ బాటిల్స్.. పడుకునే బెడ్‌పై తప్ప.. ఈ ‘బీర్ సైకో’ ఏం చేశాడంటే...

కార్తీక్ గదిలో కనిపించిన దృశ్యం

ఆ యువకుడు మద్యానికి ఎంతలా అలవాటు పడ్డాడంటే అతని గదిలో బెడ్‌ చుట్టూ ఖాళీ బీర్ బాటిల్సే. అన్ని బీర్లు తాగుతూ విచక్షణ కోల్పోయి బీర్లు కొనుక్కుని తాగడానికి డబ్బులివ్వలేదని కన్నతండ్రినే చంపేశాడు. ఈ ‘బీర్ సైకో’కు సంబంధించిన షాకింగ్ ఘటన తమిళనాడులోని కడలూరులో వెలుగుచూసింది.

 • Share this:
  ఆ యువకుడు మద్యానికి ఎంతలా అలవాటు పడ్డాడంటే అతని గదిలో బెడ్‌ చుట్టూ ఖాళీ బీర్ బాటిల్సే. అన్ని బీర్లు తాగుతూ విచక్షణ కోల్పోయి బీర్లు కొనుక్కుని తాగడానికి డబ్బులివ్వలేదని కన్నతండ్రినే చంపేశాడు. ఈ ‘బీర్ సైకో’కు సంబంధించిన షాకింగ్ ఘటన తమిళనాడులోని కడలూరులో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సుబ్రమణ్యన్ (75) డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య సరస్వతి రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆనంద సెంథిల్, కార్తీక్, గణేష్, మరో కూతురు ఉన్నారు. కార్తీక్, గణేష్ కవల పిల్లలు. కొన్నేళ్ల క్రితం సుబ్రమణ్యన్ భార్య చనిపోయింది. ఆయన కుమార్తె అమెరికాలో ఉంటోంది.

  ఆనంద సెంథిల్ బెంగళూరులో, గణేష్ చెన్నైలో స్థిరపడ్డారు. కార్తీక్ (32), సుబ్రమణ్యన్ కలిసి కడలూరు జిల్లాలోని తమ సొంతింట్లో ఉంటున్నారు. కార్తీక్‌కు పెళ్లి కాలేదు. ఎంబీఏ పూర్తి చేశాడు. ఈ కుటుంబంలో అందరూ తలో చోట స్థిరపడి గౌరవంగా జీవనం సాగిస్తున్నారు. కానీ.. ఒక్క కార్తీక్ మాత్రం ఎంబీఏ చేసి ఖాళీగా ఉంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తప్పని చెప్పేందుకు తల్లి లేకపోవడం, తండ్రి మాటను లెక్క చేయకపోవడంతో కార్తీక్ రోజురోజుకూ దిగజారిపోయాడు. బీర్లు తాగుతూ మద్యానికి బానిసగా మారాడు. రోజూ.. బీర్లూ, ధూమపానం చేసి తన గదిలో నిద్రపోవడమే పనిగా కార్తీక్ తయారయ్యాడు. తన గదిలో నుంచి బయటకు వచ్చేవాడే కాదు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం కూడా చాలా అరుదు. అతనిని మార్చేందుకు తండ్రి సుబ్రమణ్యన్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ.. ఫలితం లేకుండా పోయింది.  కార్తీక్ రోజురోజుకూ సైకోలా తయారయ్యాడు. అతని మానసిక స్థితి ఆందోళన కలిగించింది. ఈ క్రమంలో.. అక్టోబర్ 18న తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. తనకు బీర్ కొనుక్కోవడానికి డబ్బులివ్వాలని తండ్రిని కార్తీక్ అడిగాడు. ‘ఎన్ని బీర్లు తాగావో నీకైనా తెలుస్తుందా.. ఇంక ఇవన్నీ మానేయ్’ అని తండ్రి సుబ్రమణ్యన్ కొడుకును మందలించాడు. ‘అదంతా నీకు అనవసరం. నాకు బీరు కొనుక్కోవడానికి డబ్బులిస్తావా.. లేదా’ అని కార్తీక్ గట్టిగా మాట్లాడాడు. కొడుకు వైఖరితో విసిగిపోయిన సుబ్రమణ్యన్ డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పాడు. అప్పటికే విచక్షణ కోల్పోయిన స్థితిలో ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్న కార్తీక్ కోపంతో.. క్షణికావేశంలో తండ్రిని ఇనుప పైప్‌తో కొట్టాడు. పలుమార్లు దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. తలపై బలంగా తగలడంతో సుబ్రమణ్యన్ స్పాట్‌లోనే కుప్పకూలిపోయాడు.

  ఇది కూడా చదవండి: Husband: ఇతని భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఆమెతో పడక విడాకులు అడిగాడు.. ఇంతలోనే ఇదేం పాడు పని..

  కార్తీక్ భయంతో తన గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నాడు. తండ్రీకొడుకుల గొడవను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కు చేరుకునే సరికి సుబ్రమణ్యన్ రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించాడు. కార్తీక్ కోసం వెతకగా అతని రూమ్‌లో కనిపించాడు. అతని రూం చూసిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. కార్తీక్ పడుకునే బెడ్‌పై తప్ప రూం నిండా ఖాళీ బీరు బాటిల్స్, ఖాళీ సిగరెట్ ప్యాకెట్స్ చూసి పోలీసులు కంగుతిన్నారు. కార్తీక్ ఎంతలా చెడు వ్యసనాలకు బానిసయ్యాడో పోలీసులకు అర్థమైపోయింది. పోలీసులు కార్తీక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన తండ్రిని తానే చంపినట్లు అంగీకరించాడు. పోలీసులు కార్తీక్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: