Fire in Hospital : హాస్పిటల్ లో అగ్నిప్రమాదం..మంటల్లో కాలిపోయిన 11మంది చిన్నారులు
ప్రతీకాత్మక చిత్రం
Eleven Babies Die In Hospital Fire : హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు.
Eleven Babies Die In Hospital Fire : హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికన్ దేశమైన సెనెగల్ లోని టివయూనే పట్టణంలోని పబ్లిక్ హాస్పిటల్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. బుధవారం పబ్లిక్ హాస్పిటల్ నీనోనతల్ డిపార్ట్మెంట్ లో షార్ట్ సర్కూట్ కారణంగా ఒక్కసారిగా పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి.
వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు. 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సదస్సు కోసం జెనీవా వెళ్లి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అబ్దులాయే డియూఫ్ సర్.. తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశానికి పయనమయ్యారు.ప్రమాదం గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆ దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని, వేగంగా వ్యాపించిన మంటలను అదుపుచేసేలోపే ఈ ఘోరం జరిగిందని నగర మేయర్ డెంబా డియోప్ తెలిపారు. రెస్క్యూ ప్రయత్నాలను ఆటంకం కలిగేలా గ్యాస్ బాటిళ్లు పేలాయని సాక్షులను ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.