దారుణం.. పండులో టపాసులు పెట్టి.. గర్భంతో ఉన్న ఏనుగును చంపేశారు..

ఏనుగు పొట్టలో... 18 నెలల గున్న ఏనుగు ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పైనాపిల్ పేలుడుకి... ఏనుగు నోరు పూర్తిగా నాశనమైందనీ, నాలిక తీవ్రంగా తెబ్బతిందని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: June 3, 2020, 5:12 PM IST
దారుణం.. పండులో టపాసులు పెట్టి.. గర్భంతో ఉన్న ఏనుగును చంపేశారు..
కేరళ ఏనుగు మృతి..
  • Share this:
కేరళలోని ఓ ఏనుగు విషాద పరిస్థితుల్లో ఓ నదిలో నిల్చొని చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కారణం... ఆ ఏనుగు తిన్న పైనాపిల్ పేలిపోవడమే. ఆ ఏనుగు బతికివుంటే... త్వరలో మరో గున్న ఏనుగుకు జన్మనిచ్చేదే. కొంతమంది స్థానికులు ఆ ఏనుగుకు నిండా క్రేకర్లు నింపిన పైనాపిల్ నోట్లో పెట్టారు. అవి పేలడంతో... ఏనుగు నోట్లో భారీగా పేలుడు సంభవించి... అది చనిపోయింది. ఉత్తర కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యంలో పడేసి, ఆవేదన చెందేలా చేస్తోంది.

అడవిలో ఉండే ఆ ఏనుగు... ఆకలితో... ఆహారం కోసం వెతుక్కుంటూ... దగ్గర్లోని ఓ గ్రామంలోకి వచ్చింది. వీధుల్లో ఏనుగు తిరుగుతుంటే... పిల్లలు సంబరపడ్డారు. ఇంతలో కొంతమంది ఆకతాయిలు... ఏనుగును భయపెడితే... తిరిగి అడవిలోకి వెళ్లిపోతుందని అనుకొని... బాణసంచా తెచ్చారు. ఐతే... ఆకతాయిలకు ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. వెంటనే... క్రేకర్లను ఓ పైనాపిల్‌లో కుక్కారు. వాటికి నిప్పు పెట్టి... ఏనుగు నోట్లో పెట్టారు. వాళ్లు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో గ్రహించలేకపోయిన ఏనుగు... ఆ పైనాపిల్‌ను నోట్లోకి తీసుకుంది. అది భారీగా పేలింది.

ఏనుగు పొట్టలో... 18 నెలల గున్న ఏనుగు ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పైనాపిల్ పేలుడుకి... ఏనుగు నోరు పూర్తిగా నాశనమైందనీ, నాలిక తీవ్రంగా తెబ్బతిందని అధికారులు తెలిపారు. కాలిన నోటితో ఆ ఏనుగు కేకలు పెడుతూ... ఊరి సందుల్లో అటూ ఇటూ తిరిగింది. ఏదీ తినలేకపోయింది.

ఆ ఏనుగు ఇప్పటివరకూ ఎవ్వరికీ హాని చెయ్యలేదనీ, చాలా మంచిదని అధికారులు తెలిపారు. గాయాల నొప్పి, బాధతో ఆ ఏనుగు చివరకు వెల్లియార్ నదిలోకి వెళ్లింది. అక్కడ నీరు తాగింది. ఆ తర్వాత నదిలోనే నిల్చొని చనిపోయింది. చనిపోయే ముందు ఆ ఏనుగు... నీటిని తాగడం ద్వారా ఆ నొప్పిని తగ్గించుకొని ఉండొచ్చని అంటున్నారు. దానిని తిరిగి అడవికి తీసుకెళ్లి... అంత్యక్రియలు చేశారు. జరిగిన ఘటనపై కేరళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
First published: June 3, 2020, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading