ఏనుగు వ్యథ... కంచెలో ఇరుక్కుని చనిపోయిన గజరాజు...

గ్రామస్థుల నుంచి తప్పించుకునే క్రమంలో కంచె దాటేందుకు ప్రయత్నించిన ఏనుగు... శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి చనిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని నాగర్‌హోల్ జాతీయ పార్క్‌లో చోటు చేసుకుంది.

news18-telugu
Updated: December 15, 2018, 7:09 PM IST
ఏనుగు వ్యథ... కంచెలో ఇరుక్కుని చనిపోయిన గజరాజు...
ఇనుప కంచెలో ఇరుక్కుని చనిపోయిన ఏనుగు
  • Share this:
ఏనుగు ఊళ్ల మీద పడి బీభత్సం సృష్టించడం రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. అవి ఊళ్ల మీద పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కూడా మెల్లిమెల్లిగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే వాటి రక్షణ కోసం తీసుకునే చర్యలే వాటి ప్రాణం పోవడానికి కారణమవుతుందని ఊహించగలమా ? కానీ కర్ణాటకలో అదే జరిగింది. ఏనుగులు ఊళ్లలోకి రాకుండా ఉండేందుకు తీసుకున్న రక్షణ చర్యలే... ఓ ఏనుగు చనిపోవడానికి కారణమైంది. ఊహించని విధంగా ఏనుగు ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్లో విషాదం నింపింది.

ఇనుప కంచెలో ఇరుక్కుని చనిపోయిన ఏనుగు


42 ఏళ్ల మగ ఏనుగు కర్ణాటకలోని నాగర్‌హోల్ పార్క్ నుంచి బయటకు వచ్చిన గ్రామాల్లోకి ప్రవేశించింది. దాన్ని మళ్లీ అడవిలోకి తరిమేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. భయంతో పరుగులు తీసిన ఏనుగు రైల్వే కంచెపైకి ఎక్కింది. అయితే మళ్లీ దిగే అవకాశం లేకపోవడం... శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడింది. కొంతసేపు నరకయాతన అనుభవించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందిపడితే... మిగతా జంతువుల కంటే ఏనుగులు తొందరగా ప్రాణాలు కోల్పోతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఛాతి మీద ఎక్కువ ఒత్తిడి పడటం ఏనుగు ప్రాణాలు పోవడానికి కారణమైందని వెల్లడించారు.

అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాదకరమైన కంచెలు


ఏనుగులు గ్రామాల మీదకు రాకుండా, రైలు పట్టాల మీదకు వచ్చి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు రూ. 212 కోట్లతో ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును 2015లో ప్రారంభించారు. 33 కిలోమీటర్ల మేర ఈ కంచెను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. కేవలం ఏనుగుల కోసమే ఈ కంచెను ఏర్పాటు చేశారు. అయితే ఈ కంచెలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదనే విమర్శలు కూడా ఉన్నాయి.

అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాదకరమైన ఏనుగులు


ఏనుగులు రైలు పట్టాలపై రాకుండా ఉండేందుకు అటవీశాఖ తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని మొరటు చర్యలుగా అభివర్ణించింది. వాటిని ఆరు నెలల సమయంలోపు ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. అయితే తమ చర్యలను కర్ణాటక అటవీశాఖ సమర్థించుకుంది. కొన్ని చోట్ల మాత్రమే కత్తిలాంటి వస్తువులను కంచెలకు అమర్చామని సుప్రీంకోర్టుకు వివరించింది.
Published by: Kishore Akkaladevi
First published: December 15, 2018, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading