• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • ELEPHANT ATTACKS MAN TO DEATH IN KARNATAKA BS

ఏనుగుల బీభత్సం... పారిపోతున్నా వెంబడించి, కాళ్ల కింద నలిపేసి...

ఏనుగుల బీభత్సం... పారిపోతున్నా వెంబడించి, కాళ్ల కింద నలిపేసి...

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. మైసూరు గ్రామాల్లో ఏనుగులు రోడ్లపైకి వచ్చి పంటపొలాలను, ఇళ్లను ధ్వంసం చేస్తున్నట్లు గుర్తించి వాటిని తిరిగి అడవుల్లోకి పంపే చర్యలు చేపట్టారు.

  • Share this:
    కూలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి ఆయన.. రోజూ లాగే ఆ రోజు కూడా పని కోసం అని బయలుదేరాడు. కానీ, ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది. కెక్కెరి గ్రామానికి చెందిన హనుమంతప్ప అనే వ్యక్తి శనివారం ఉదయం పని కోసం వెళ్తుండగా అటుగా వచ్చిన ఏనుగులు అతడిపైకి దూసుకొచ్చాయి. వెంటనే వాటి నుంచి తప్పించుకోవడానికి హనుమంతప్ప పరుగులు తీశాడు. అయినా వదలని గజరాజులు వెంబడించాయి. ఓ ఏనుగు అతడ్ని తొక్కించి కాళ్ల కింద నలిపేసింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందాడు.

    బాధిత కుటుంబానికి అటవీ శాఖ రూ.5లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. మైసూరు గ్రామాల్లో ఏనుగులు రోడ్లపైకి వచ్చి పంటపొలాలను, ఇళ్లను ధ్వంసం చేస్తున్నట్లు గుర్తించి వాటిని తిరిగి అడవుల్లోకి పంపే చర్యలు చేపట్టారు. గత వారంగా ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయని, వాటిని తిరిగి అడవుల్లోకి పంపేందుకు శిక్షణ పొందిన అర్జున అనే ఏనుగును రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని శిక్షణ పొందిన ఏనుగులను కూడా రంగంలోకి దించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
    First published:

    అగ్ర కథనాలు