47 Year Old Woman: 47 ఏళ్ల వయసున్న తల్లి.. పాతికేళ్ల లోపు వయసున్న ఇద్దరు కూతుళ్లు.. పెద్ద కూతురు చేసిన పనివల్ల..

ఆ కుటుంబం నివాసమున్న ఇల్లు

  • Share this:
    మదురై: వివాహేతర సంబంధాలతో ఎప్పటికైనా ముప్పు తప్పదని రోజుకో ఘటన గుర్తుచేస్తున్నా కొందరి తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ అక్రమ సంబంధాల మూలాన వాళ్లు చిక్కుల్లో పడిందే కాకుండా ఇంట్లో వారినీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మదురై జిల్లాలోని మేలూరు పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేలూరుకు చెందిన నీలా దేవికి(47) ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె పేరు మహేశ్వరి(24), చిన్న కుమార్తె పేరు అఖిలాండేశ్వరి(22). ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేసి అత్తారిళ్లకు పంపించిన నీలాదేవికి కొన్నాళ్లకు చిన్న కూతురి రూపంలో చిక్కులు ఎదురయ్యాయి. పెళ్లయిన కొన్నాళ్లు భర్త ప్రసాద్‌తో అన్యోన్యంగానే ఉన్న అఖిలాండేశ్వరి కొన్నాళ్లకు మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఆమె పుట్టింటిలోనే, తల్లితో పాటే ఉంటోంది. నీలాదేవి పెద్ద కుమార్తె మహేశ్వరి భర్త నుంచి దూరంగా ఉంటూ శశికుమార్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ పుట్టింట్లోనే ఉంటోంది. మగ దిక్కు లేని కుటుంబం కావడంతో ఈ కుటుంబానికి సమీప బంధువు ముత్తుకృష్ణన్ అన్నీ తానై చూసుకుంటున్నారు. ఈ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే ఆయనే ముందుండేవారు. వీళ్లతో పాటే కలిసి ఉండేవారు. మంగళవారం రాత్రి ముత్తుకృష్ణన్ పొలానికి వెళ్లిన సమయంలో ఘోరం జరిగింది. అర్ధరాత్రి నీలాదేవి(47), ఆమె చిన్న కుమార్తె అఖిలాండేశ్వరి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం పొలం నుంచి ఇంటికెళ్లిన ముత్తుకృష్ణన్ రక్తపు మడుగులో పడి ఉన్న తల్లీకూతురిని చూసి హతాసుడయ్యాడు. వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు. మదురై జిల్లా ఎస్పీ సుజిత్ కుమార్ రంగంలోకి దిగారు. ఆ కుటుంబం గురించి ఎస్పీకి ముత్తు కృష్ణన్ అన్ని విషయాలు చెప్పాడు. పెద్ద కుమార్తె మహేశ్వరికి ఉన్న వివాహేతర సంబంధం గురించి కూడా ఎస్పీకి చెప్పాడు. మహేశ్వరి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో ఈ హత్య కేసులో విచారణ సాగించగా అసలు నిజం బయటపడింది. శశికుమార్‌తో మహేశ్వరి వివాహేతర సంబంధం కొనసాగించడం పట్ల నీలాదేవి, అఖిలాండేశ్వరి అసంతృప్తితో ఉన్నారని.. ఈ విషయంలో ఆమెతో పలుమార్లు తల్లీకూతురు గొడవ పెట్టుకున్నారని విచారణలో తేలింది.

    శశికుమార్‌తో తన అఫైర్ కొనసాగించేందుకు తల్లీచెల్లీ అడ్డు వస్తున్నారని భావించిన మహేశ్వరి వాళ్లను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే.. తన ప్రియుడైన శశికుమార్‌కు ఈ విషయాన్ని చెప్పింది. అతను కూడా ఈ హత్యలకు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి నీలాదేవిని, అఖిలాండేశ్వరిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

    ఇది కూడా చదవండి: Affair: మూడు పెళ్లిళ్లు చేసుకున్నా మోజు తీరక మరో మహిళతో అఫైర్.. అంతటితో కూడా ఆగక.. చెప్పాలంటేనే..

    నీలాదేవి పెద్ద కూతురైన మహేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు శశికుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నీలాదేవి, అఖిలాండేశ్వరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం మోజులో కన్న తల్లిని, సొంత చెల్లిని హతమార్చిన విషయం తెలుసుకున్న స్థానికులు ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
    Published by:Sambasiva Reddy
    First published: