ఆమె పేరు కమలమ్మ. 85 ఏళ్ల వృద్ధురాలు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. భర్త లక్ష్మీనారాయణ ఆర్అండ్ బీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. పిల్లలకు వివాహాలు కావడంతో వేర్వేరు చోట్ల నివాసం ఉంటున్నారు. భర్త 15 సంవత్సరాల క్రితమే కాలం చేశాడు. ఫలితంగా చెప్పల్ బజారులో ఒంటరిగా ఉంటోంది. అయితే కమలమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడం.. పిల్లలు వేరే చోట నివాసం ఉంటున్నారు. దీంతో ఆమెకు సాయంగా ఉండేందుకు ఓ పనిమనిషిని నియమించారు. సదరు పనిమనిషి మీదే పూర్తిగా ఆధారపడింది. పనిమనిషి సైతం చాలాకాలంగా వృద్ధురాలి వద్ద నమ్మకంగా పనిచేస్తోంది. అయితే ఆ పనిమనిషి పింఛను సొమ్ము కోసం ఊరికి వెళ్లింది. మూడు రోజుల క్రితం విజయనగరానికి చెందిన లక్ష్మి(38)ని ఉప్పల్లోని ఓ ఏజెన్సీ వారు వృద్ధురాలి ఇంటికి పనిమనిషిగా పంపించారు.
శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో వృద్ధురాలి ఇంటిలో నివాసం ఉంటే సునీత అనే మహిళ వచ్చి చూడగా కమలమ్మ మంచంపై చనిపోయి పడి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఎదురింటి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి కొత్తగా చేరిన పనిమనిషి లక్ష్మిని నిందితురాలిగా తేల్చారు. వృద్ధురాలు చేతికి ఉండాల్సిన బంగారు గాజులు, బీరువాలోని నెక్లెస్, పది తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు దొంగిలించింది. కమలమ్మ ముఖంపై దిండు పెట్టి అదిమి చంపేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.