దారుణం.. వృద్ధురాలిపై నడిరోడ్డుపై దాడి.. కిందపడేసి కుర్చీతో కొట్టి..

దాడి సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అయ్యో పాపం అనుకున్నారే తప్ప.. అడ్డుకోలేదు.

news18-telugu
Updated: September 16, 2020, 7:10 AM IST
దారుణం.. వృద్ధురాలిపై నడిరోడ్డుపై దాడి.. కిందపడేసి కుర్చీతో కొట్టి..
వృద్ధురాలిపై దాడి దృశ్యాలు
  • Share this:
ఆమెకు 70 ఏళ్ల వయసు ఉంటుంది. అలాంటి వృద్ధురాలిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే విచక్షణా రహితంగా కొట్టాడు. కిందపడేసి కుర్చీతో చావబాదాడు. యూపీలోని ఘజియాబాద్‌ జిల్లా రాజాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 12న ఈ ఘటన జరిగింది. వృద్ధురాలిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలి నేలపై పడేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ఆ పెద్దావిడపై కుర్చీతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె అక్కడే పడిపోయింది. వద్దు.. కొట్టవద్దని వేడుకుంటున్నా.. అతడు వినలేదు. ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెపై విరుచుకుపడ్డాడు.

దాడి సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అయ్యో పాపం అనుకున్నారే తప్ప.. అడ్డుకోలేదు. సీసీ టీవీ ద‌ృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు ఘజియాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని చంపేయాలని మండిపడుతున్నారు. అంతేకాదు వృద్ధురాలిపై దాడి చేస్తున్నప్పుడు ఏ ఒక్కరూ అడ్డుకోకపోవడాన్ని తప్పుబట్టడుతున్నారు. ఇదీ మన సమాజం అంటూ విమర్శిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 16, 2020, 7:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading