చెప్పిన కూర భార్య వండలేదని.. భర్త ఎంత పనిచేశాడంటే..

దాదాపు 50 ఏళ్లకు పైగానే కలిసి కాపురం చేశారు. అయితే గురువారం ఇంటిలో పప్పు కూర వండాలని భార్య నాగరత్నానికి సూచించాడు. అయితే నాగరత్నం పప్పు కూర వండలేకపోయింది.

news18-telugu
Updated: July 17, 2020, 2:17 PM IST
చెప్పిన కూర భార్య వండలేదని.. భర్త ఎంత పనిచేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారిద్దరూ భార్యభర్తలు. దాదాపు 50 ఏళ్లకు పైగా కలిసే జీవించారు. ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో అనుభవాలు.. అన్ని చూశారు. ఇక హాయిగా జీవిత చరమాంకాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి. కానీ అన్నేండ్లపాటు తమ జీవితాలను నెట్టుకొచ్చిన ఓ వృద్ధుడు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాలకే చేదు గుర్తుగా మిగిలిపోయింది. తాను చెప్పిన కూర వండలేదన్న క్షణికావేశంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాశీబుగ్గ పరిధిలోని పలాస 18వ వార్డులోని అన్నపూర్ణ వీధికి చెందిన బెల్లాల ఆంజనేయులు(77), భార్య నాగరత్నం భార్యభర్తలు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. దాదాపు 50 ఏళ్లకు పైగానే కలిసి కాపురం చేశారు. అయితే గురువారం ఇంటిలో పప్పు కూర వండాలని భార్య నాగరత్నానికి సూచించాడు.

అయితే నాగరత్నం పప్పు కూర వండలేకపోయింది. దీంతో ఆగ్రహించిన ఆంజనేయులు క్షణికావేశంలో సమీపంలో ఉన్న నేలబావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి.. నిజంగానే భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే.. కరోనా వైరస్ నేపథ్యంలో ఇళ్లలోనే ఉంటూ బయటకు వెళ్లలేక కొందరు మానసికంగా వేదన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల ఆత్మహత్యలు, హత్యలు జరిగిన సందర్భాలు లేకపోలేదు.
Published by: Narsimha Badhini
First published: July 17, 2020, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading