• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • ELDERLY COUPLE KILLED AFTER A MERCEDES CAR RAN OVER IN DELHI SSR

Delhi: ఎక్కడో ఆలోచిస్తూ కారు నడిపిన యువతి.. ఫలితం వృద్ధ దంపతుల చావు.. బెయిల్‌పై యువతి బయటకు..

Delhi: ఎక్కడో ఆలోచిస్తూ కారు నడిపిన యువతి.. ఫలితం వృద్ధ దంపతుల చావు.. బెయిల్‌పై యువతి బయటకు..

సీసీ ఫుటేజీ దృశ్యాలు

ఢిల్లీలో ఓ 28 ఏళ్ల యువతి రోడ్డు పక్కన సాయంత్రం వాక్‌కు వచ్చిన ఇద్దరు వృద్ధ దంపతులపై నుంచి ప్రమాదవశాత్తూ కారును పోనిచ్చింది. దీంతో.. తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరూ చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారకాలో డాక్టర్ శాంతి స్వరూప్ అరోరా(72), ఆయన భార్య అంజన(62) నివాసముంటున్నారు. పిల్లలు అమెరికాలో సెటిల్..

  • Share this:
    న్యూఢిల్లీ: నగరాల్లో ఉండే వాహనాల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రోజుకు కొన్ని వందల వాహనాలు రోడ్డు మీద మెరుపు వేగంతో వెళుతుంటాయి. అయితే.. వాహనాలు రోడ్డుపై వెళితే పర్వాలేదు గానీ రోడ్డు పక్కన నడిచి వెళ్లే పాదచారులపై నుంచి వెళ్తే.. ఢిల్లీలో సరిగ్గా అదే జరిగింది. ఢిల్లీలో ఓ 28 ఏళ్ల యువతి రోడ్డు పక్కన సాయంత్రం వాక్‌కు వచ్చిన ఇద్దరు వృద్ధ దంపతులపై నుంచి ప్రమాదవశాత్తూ కారును పోనిచ్చింది. దీంతో.. తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరూ చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారకాలో డాక్టర్ శాంతి స్వరూప్ అరోరా(72), ఆయన భార్య అంజన(62) నివాసముంటున్నారు. పిల్లలు అమెరికాలో సెటిల్ అవడంతో ఈ దంపతులిద్దరూ ద్వారకా సెక్టార్ 11లో ఉన్న అప్పు ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే అలవాటుంది. శాంతి స్వరూప్ డాక్టర్ కావడంతో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. రోజూలానే ఆదివారం సాయంత్రం కూడా వాకింగ్‌ చేసుకుంటూ ఈ దంపతులు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్నారు. సరిగ్గా సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ఇద్దరూ రోడ్డు పక్కన వెళుతుండగా వెనక నుంచి అకస్మాత్తుగా ఓ కారు వచ్చి ఇద్దరినీ ఢీ కొట్టింది. ఆ తర్వాత వారిపై నుంచి వెళ్లింది. ఇంతలో కారులో నుంచి ఓ యువతి బయటకు దిగింది. ఆ యువతి పేరు దీపాక్షి చౌదరి. ఆ యువతి కూడా ఈ దంపతులు నివాసముండే సొసైటీలోనే ఉంటుందని స్థానికులు తెలిపారు. కారు దిగి బయటకు వచ్చిన ఈ యువతి సాయం కోసం అటూఇటూ చూస్తుండగా.. స్థానికులు వచ్చి కారు కింద చిక్కుకున్న ఆ దంపతులను బయటకు తీశారు. ఆ సమయంలో దీపాక్షి ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన శాంతి స్వరూప్‌ను, ఆయన భార్య అంజనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ దంపతులిద్దరూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

    అయితే.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు దీపాక్షి చౌదరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ దంపతులను తాను చూసుకోలేదని, వేరే ఏదో ఆలోచిస్తుండగా ఇలా జరిగిందని పోలీసులకు సదరు యువతి చెప్పడం గమనార్హం. అందుకే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోలేదని, ఆ దంపతులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించిందని పోలీసులు కూడా సమర్థించడం కొసమెరుపు.

    ఐపీసీ సెక్షన్ 304ఏ కింద, సెక్షన్ 279 కింద దీపాక్షిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌కు వెళ్లిన కొంతసేపటికి దీపాక్షి బెయిల్‌పై విడుదలయింది. ఆమె కారును పోలీసులు సీజ్ చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రెండు ప్రాణాల ఖరీదు ఒక కారా అని నిలదీస్తున్నారు. దీపాక్షి ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు