దొంగలకు షాక్...ముసలోళ్లే కదా ఏం చేస్తారులే అనుకున్నారు...కానీ చితకబాదేశారు...

ఇంతలో ఆ వృద్ధుడి భార్య తలుపు తీసుకొని బయటకు వచ్చి చేతికి అందిన చెప్పులు, ప్లాస్టిక్ కుర్చీతో ఆ దుండగుడిపై దాడికి దిగింది. ఇంతలో మరో వ్యక్తి కూడా కొడవలితో వచ్చి మహిళపై దాడి చేసే యత్నం చేశాడు.

news18-telugu
Updated: August 12, 2019, 4:59 PM IST
దొంగలకు షాక్...ముసలోళ్లే కదా ఏం చేస్తారులే అనుకున్నారు...కానీ చితకబాదేశారు...
(Image: News18 Tamil)
  • Share this:
తమిళనాడు తిరునల్వేలిలోని వృద్ధ దంపతులపై ఇద్దరు దోపిడీ దొంగలు కొడవళ్లతో దాడికి తెగబడ్డారు. అయితే ఆ దుండగులను అత్యంత ధైర్య సాహసాలతో ఎదిరించి పారిపోయే దాకా ఆ వృద్ధదంపతులు తరిమికొట్టిన ఘటన ప్రస్తుతం వైరల్ అయ్యింది.వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి జిల్లా తిరుమంగళం గ్రామంలో రాత్రి వేళ ఆరుబయట కుర్చీలో కూర్చున్న వృద్ధుడిపై వెనక నుంచి వచ్చిన ఒక దుండగుడు దాడి చేశాడు. ఒక చేతి గుడ్డతో వృద్ధుడి మెడను గట్టిగా చుట్టేసి ఊపిరి ఆడకుండా చేశాడు. అయితే ఇంతలో ఆ వృద్ధుడి భార్య తలుపు తీసుకొని బయటకు వచ్చి చేతికి అందిన చెప్పులు, ప్లాస్టిక్ కుర్చీతో ఆ దుండగుడిపై దాడికి దిగింది. ఇంతలో మరో వ్యక్తి కూడా కొడవలితో వచ్చి మహిళపై దాడి చేసే యత్నం చేశాడు. ఇంతలు ఆ వృద్ధ వ్యక్తి తన మెడకు వేసిన గుడ్డను వదిలించుకొని దాడికి దిగాడు. చేతికందిన కుర్చీతో ఇద్దరు దుండగులపై దాడి చేశాడు. అయితే ఇద్దరూ మంకీ క్యాప్‌లు ధరించి ఉండటంతో.. గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయింది.

ఇద్దరు వృద్ధుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవ్వడంతో ఇక చేసేదేమి లేక దుండగులు పారిపోయారు. అయితే ఇదంతా ఆ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యింది. మరోవైపు పోలీసులు సైతం కేసు నమోదు చేసుకొన నిందితుల కోసం క్లూస్ వెతుకుతున్నారు. కాగా వృద్ధదంపతుల సాహసాన్ని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.



First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...