ELDER BROTHER WHO POURED PETROL ON HIS YOUNGER SIBLINGS DURING A PROPERTY DISPUTE IN KHAMMAM SNR
Khammam: బాబాయ్పైన కోపంతో తమ్ముళ్లను తగలబెట్టాలని చూశాడు .. పాపం అతడూ కాలిపోయాడు
ప్రతీకాత్మక చిత్రం
Crime News: భూమి విషయంలో తన తండ్రితో బాబాయ్ గొడవపడటం జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా బాబాయ్‌కి బుద్ధి చెప్పాలని అతని ఇద్దరు కొడుకులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈఘటనలో తమ్ముళ్లతో పాటు తాను కూడా కాలిపోయాడు. ముగ్గురు అన్నదమ్ములు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భూమి కోస జరిగే గొడవలు రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు కూడా పగవాళ్లుగా మారిపోతున్నారు. పగ, ప్రతీకారమే కాదు చివరకు ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునేంతగా మారిపోతున్నాయి. ఖమ్మం(Khammam)టౌన్లో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. మేదర బజార్(Medara Bazaar)కి చెందిన కోనా చిలకరావు (Kona Chilakarao), కోనా శ్రీనివాసరావు(Kona Srinivasa Rao)అన్నదమ్ములు. ఇద్దరి ఇళ్లకు సమీపంలోనే వీళ్ల ఉమ్మడి ఆస్తిగా ఒక స్తలం ఉంది. దాని విషయంలోనే తరచూ గొడవపడుతూ ఉండేవారు. పలుమార్లు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్(Police Station)లలో కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే గురువారం(Thursday)ఆస్తి తగాదా కోసం అన్నదమ్ముల మధ్య గొడవ పరాకాష్టకు చేరింది.
అన్న కొడుకే నేరస్తుడు..
కోనా చిలకరావుకు ఉమా రాజశేఖర్ అనే కుమారుడు ఉన్నాడు. కోనా శ్రీనివాసరావుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 15సంవత్సరాల భార్గవ్, 12ఏళ్ల వీరేందర్ స్కూల్లో చదువుతున్నారు. గురువారం రోజూ వెళ్లినట్లుగా స్కూల్‌కి వెళ్లి వచ్చారు. స్కూల్ నుంచి రాగానే బుక్స్ కావాలని తల్లిని కోరడంతో బుక్స్ తెచ్చేందుకు శ్రీనివాసరావు భార్య బయటకు వెళ్లింది. తన తండ్రిపై కేసు పెట్టాడని బాబాయ్‌పై కోపంతో ఉన్న ఉమా రాజశేఖర్ ఎలాగైనా అతనిపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. గురువారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డబ్బాలో పెట్రోల్ తీసుకొని వచ్చి టీవీ చూస్తున్న బాబాయ్ కొడుకులు భార్గవ్, వీరేందర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించాడు.
సొంత తమ్ముళ్లపైనే పగ..
పెద్దనాన్న కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వీరేందర్, భార్గవ్ మంటల్లో కాలిపోతూ గట్టిగా కేకలు వేశారు. తమ్ముళ్లనే కనికరం కూడా లేకుండా ఉమా రాజశేఖర్ ఇద్దరు అబ్బాయిలపై ట్రోల్ పోసి నిప్పంటించే క్రమంలో అతనికి మంటలు అంటుకున్నాయి. తప్పిచుకునే గ్రామంలో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మంటల్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. ఇంట్లోంచి ముగ్గురు గట్టిగా అరవడంతో చుట్టు పక్కల జనం వచ్చి మంటలార్పారు. ముగ్గురినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అన్నదమ్ముల ముగ్గురు పిల్లలు పెట్రోల్ మంటల్లో తీవ్రంగా కాలిపోయి గాయపడ్డారు.
ఆస్తి కోసం అఘాయిత్యం..
స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్‌కి చేరుకున్నారు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు. ప్రమాదస్తలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. 70శాతం కాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి వివరాలు సేకరించారు. చికిత్స పొందుతున్న పిల్లల నుంచి జడ్జి శాంతిలత వాంగ్మూలం తీసుకున్నారు. ఒళ్లంతా మంటలతో కాలిపోవడంతో బాధ తట్టుకోలేక చిన్నారులు గట్టి గట్టిగా అరవడం అందరితో కంటతడి పెట్టించింది. చావు-బతుకుల మధ్య బిడ్డలు అరుస్తుంటే చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. డాక్టర్లు మరో 24గంటలు గడిస్తే ఆరోగ్య పరిస్తితిని వివరంగా చెబుతామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.