హోమ్ /వార్తలు /క్రైమ్ /

Boy Found Dead: ఎవడు చేశాడో గానీ.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఈ పిల్లాడిని తీసుకెళ్లి..

Boy Found Dead: ఎవడు చేశాడో గానీ.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఈ పిల్లాడిని తీసుకెళ్లి..

సంతోష్ ఫైల్ ఫొటో

సంతోష్ ఫైల్ ఫొటో

సమాజంలో రానురాను మనిషిలో నేరప్రవృత్తి పెరిగిపోతోంది. పగలు, ప్రతీకారాలతో కొందరు రగిలిపోతున్నారు. ఆస్తి కోసమో, అక్రమ సంబంధాల కోసమో అభంశుభం తెలియని చిన్నారులను బలి చేస్తున్నారు. అలాంటి ఘటనే.. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో...

ఇంకా చదవండి ...

మహబూబునగర్: సమాజంలో రానురాను మనిషిలో నేరప్రవృత్తి పెరిగిపోతోంది. పగలు, ప్రతీకారాలతో కొందరు రగిలిపోతున్నారు. ఆస్తి కోసమో, అక్రమ సంబంధాల కోసమో అభంశుభం తెలియని చిన్నారులను బలి చేస్తున్నారు. అలాంటి ఘటనే.. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల పిల్లాడిని అతి కిరాతకంగా చంపేశారు. బంధువులే ఈ అమానుషానికి ఒడిగట్టారని పిల్లాడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జానంపేట గ్రామానికి చెందిన విష్ణు, లక్ష్మి దంపతులకు సంతోష్ అనే ఎనిమిదేళ్ల బాబు ఉన్నాడు. అందరి పిల్లల్లానే ఆ పిల్లాడూ అందరితో ఆడుకుంటూ కలిసిమెలిసి ఉండేవాడు. అయితే.. గత కొంత కాలంగా విష్ణు, లక్ష్మి కుటుంబానికి బంధువులతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే.. ప్రతిరోజులానే పిల్లలతో కలిసి సంతోష్ మూడు రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఎవరైనా వచ్చి చాక్లెట్ల ఆశచూపి తీసుకెళ్లారో లేక బలవంతంగా నోరు నొక్కి కిడ్నాప్ చేశారో తెలియదు గానీ ఇంటి ముందు ఆడుకుంటున్న సంతోష్ కనిపించకుండాపోయాడు.

విష్ణు, లక్ష్మి ఈ విషయాన్ని గమనించలేదు. ఇంటి ముందే ఆడుకుంటున్నాడు కద పిల్లలతో కలిసి ఎటైనా వెళ్లి ఉండొచ్చని అనుకున్నారు. కానీ.. ఎంతసేపటికీ సంతోష్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానమొచ్చింది. చుట్టుపక్కల ఎక్కడ వెతికినా సంతోష్ ఆచూకీ తెలియలేదు. ఆందోళన చెందిన విష్ణు తన కొడుకు అదృశ్యమయ్యాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఒకపక్క పోలీసులు వెతుకుతున్నప్పటికీ ఎక్కడైనా కనిపిస్తాడేమోనన్న ఆశతో మూడు రోజులుగా నిద్రాహారాలు మానేసి కొడుకు కోసం విష్ణు, లక్ష్మి వెతుకుతూనే ఉన్నారు.

ఎక్కడికెళ్లినా కుమారుడు తిరిగొస్తాడని ఆశతో ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. గుండెకోతే మిగిలింది. పోలీసుల గాలింపులో జానంపేట సమీపంలోని బావిలో సంతోష్ మృతదేహం లభ్యమైంది. ప్రాణాలతో తిరిగొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కన్నతల్లికి కడుపుకోతతో తల్లడిల్లింది. పుత్రశోకంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. తమ బంధువులే చిన్నారిని గొంతు నులిమి హత్య చేసి బావిలో పడేసి ఉంటారని సంతోష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime, Crime news, Murder

ఉత్తమ కథలు