పగలంతా తన తోటి వాళ్లతో ఆటలాడుకుని రాత్రిపూట అమ్మమ్మ పొత్తిళ్లలో హాయిగా ఆదమరచి నిద్రపోతున్న ఆ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డారు..
ఘోరం జరగింది. అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల పసివాడు దారుణ హత్యకు గురయ్యాడు. బండరాయితో మోది మరీ ఆ బాలుడిని హత్య చేశారు. పగలంతా తన తోటి వాళ్లతో ఆటలాడుకుని రాత్రిపూట అమ్మమ్మ పొత్తిళ్లలో హాయిగా ఆదమరచి నిద్రపోతున్న ఆ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రాత్రిపూటే బాలుడిని అపహకరించి దారుణానికి పాల్పడ్డారు. తల్లి వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన లక్ష్మి అనే మహిళకు అదే గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనుతో పదేళ్ల క్రితమే వివాహం అయింది. ఆ జంటకు ఎనిమిదేళ్ల కుమారుడు సాయి కల్యాణ్ ఉన్నాడు.
అయితే కుటుంబ కలహాల వల్ల లక్ష్మి, శ్రీను నాలుగేళ్ల క్రితమే విడిపోయారు. ఆ తర్వాత లక్ష్మి దాచేపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడితో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసింది. అయితే ఇటీవల అతడితోనూ వ్యవహారం చెడింది. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో తన కుమారుడిని తీసుకుని యర్రగొండపాలెంలో ఉంటున్న తల్లి కృష్ణవేణి వద్దకు వెళ్లింది. కాగా, లక్ష్మి చీరల వ్యాపారం చేస్తుంటుంది. యర్రగొండపాలెంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో కూడా చీరల వ్యాపారం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే కుమారుడిని తల్లి వద్ద వదిలి, లక్ష్మి మిర్యాలగూడ వెళ్లింది. అయితే గతంలో తాను సహజీవనం చేసిన వ్యక్తి కొంత కాలంగా బెదిరిస్తూ వస్తున్నాడు. తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో చంపేస్తానంటూ బెదిరిస్తూ వస్తున్నాడు. అయితే అతడి మాటలను లక్ష్మి పెద్దగా పట్టించుకోలేదు.
మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో బాలుడి అమ్మమ్మకు మెలకువ వచ్చింది. చూస్తే తన పక్కన పడుకుని కనిపించాల్సిన సాయి కల్యాణ్ లేడు. ఇంట్లో వెతికినా కనిపించలేదు. చుట్టుపక్కల చూసినా లేడు. దీంతో మనవడు కనిపించడం లేదంటూ బంధువులకు చెప్పి బోరున విలపించింది. దీంతో బంధువులు అదే రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం సమయంలో మర్కాపురం రోడ్డులో ఓ బాలుడిని బండరాయితో చంపేశారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ తో ఆధారాలు సేకరించారు. సంఘటన స్థలం నుంచి బాలుడు ఉంటున్న అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లి డాగ్ ఆగిపోయింది. దీంతో ఈ హత్యాఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.