స్కూల్ టాయిలెట్‌లో.. నలుగురు విద్యార్థులు కలిసి బాలికపై రేప్..

ఎనిమిదేళ్ల బాలికపై సీనియర్ విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. నలుగురు విద్యార్థులు రెండుసార్లు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

news18-telugu
Updated: March 25, 2020, 10:46 AM IST
స్కూల్ టాయిలెట్‌లో.. నలుగురు విద్యార్థులు కలిసి బాలికపై రేప్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చదువుకునే విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారు. స్త్రీలకు గౌరవం, మానవత్వం.. లాంటి అంశాల గురించి తెలుసుకునే వయసులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఎనిమిదేళ్ల బాలికపై సీనియర్ విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. నలుగురు విద్యార్థులు రెండుసార్లు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన ఉజ్జయినిలో చోటుచేసుకుంది. గత జనవరి 21న బాలికను అడ్డగించి స్కూల్ టాయిలెట్‌లోకి తీసుకెళ్లి ఆమెను రేప్ చేసిన విద్యార్థులు.. మరోసారి మార్చి 9న అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పగా.. ఆమె స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. తమ స్కూల్‌లో అలాంటి ఘటనలు జరగవని, బాలిక తల్లి ఆరోపణలను కొట్టిపారేశారు. దీంతో గత్యంతరం లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 25, 2020, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading