Home /News /crime /

EIGHT PATIENTS DIE AFTER A MAJOR FIRE AT A PRIVATE HOSPITAL IN JABALPUR MADHYA PRADESH PAH

Fire accident: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది పెషెంట్ల సజీవ దహానం..

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

Madhya pradesh: జబల్ పూర్ లో స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh) భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జబల్ పూర్ లో (Jabalpur) ఉన్న స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో (Private hospital)  సోమవారం మంటలు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. నలుదిక్కుల నుంచి మంటలు భారీగా చెలరేగాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. ఫైరింజన్ లను రప్పించారు. అంబులెన్స్ లను తరలించారు. ఆస్పత్రిలో రోగులను ఇతర ఆస్పత్రులకు షిప్ట్ చేశారు.

మంటలను (Fire accident) అదుపులోనికి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో ఉన్న 8 మంది పెషెంట్లు మంటల్లో కాలిపోయారని అధికారులు గుర్తించారు. మంటల్లో మరింత మంది చిక్కుకుని తీవ్రంగా గాయపడినట్లు అధికారులు గుర్తించారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా ఆస్పత్రిలో మరికొంత మంది సిబ్బంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.





ఇదిలా ఉండగా గతంలో హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది.

సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గౌడౌన్‌ (Bhoiguda Scrap godown fire accident) లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాటిని అదుపుచేసేందుకు 8 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్‌లో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ గోడౌన్ రెండతస్తుల్లో ఉంది. పై అంతస్తులో కార్మికులు అర్ధరాత్రి వరకు పనిచేసిన తర్వాత.. అక్కడే నిద్రపోయారు. వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కింది అంతస్తు నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కిందకు వెళ్లేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు.. ఒకే మార్గం ఉండడం.. అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. కార్మికులు ఎటూ వెళ్లలేకపోయారు. పై అంతస్తులోనే ఉండిపోయి.. అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Fire Accident, Madhya pradesh

తదుపరి వార్తలు