వారంతా రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీలు.. వానకాలం సీజన్ ఊపందుకోవడంతో సంతోషంగా ఉన్నారు.. ఇవాళ ఉదయం కూడా ఉత్సాహంగా పనుల్లోకి బయలుదేరారు.. ప్రతిరోజులాగే గురువారం కూడా ఎంగేజ్ ఆటోలో ప్రయాణిస్తోన్న వారిని అనూహ్యంగా మృత్యువు కబళించింది. హైటెన్షన్ విద్యుత్ వైరు ఒక్కసారిగా తెగిపడి ఆటోపై పడటం.. ఆటో నిలువునా తగలబడిపోవడం.. అందులోని వారు సజీవదహనం కావడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది.. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం..
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాడిమర్రి మండలంలో పెను విషాద ఘటన జరిగింది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 8 మంది ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడ్డాయి దీంతో..
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కిందికి దూకే వీలు కూడా లేకుండా క్షణాల్లో కరెంటు, మంటలు ఆటోలో వెళ్తున్న ఎనిమిది మంది ప్రాణాలను తీసేసేశాయి. లోపలున్న అందరూ సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు.
స్థానికులు ప్రమాద స్థలికి చేరే సమయానికి ఆటోతోపాటు తగలబడుతోన్న మృతదేహాలే తప్ప ఏ ఒక్కరినీ కాపాడే పరిస్థితి కనిపించలేదు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇంతటి ఘోరం ఎలా జరిగిందో, మృతుల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Anantapuram, Andhra Pradesh, AP News