తన ముందు కుర్చీలో కూర్చొందని మహిళా ఉద్యోగిని కాలితో తన్నిన హోటల్ యజమాని...

ఓయో మహిళా ఉద్యోగిపై దాడి చేసిన స్టార్ హోటల్ ఎమ్.డీ.... సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు, సోషల్ మీడియాలో వైరల్... రెండురోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన హోటల్ యజమాని...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 9, 2019, 6:23 PM IST
తన ముందు కుర్చీలో కూర్చొందని మహిళా ఉద్యోగిని కాలితో తన్నిన హోటల్ యజమాని...
సీసీటీవీ ఫుటేజ్‌లో దాడి దృశ్యాలు
  • Share this:
అహం... అన్నీ అనర్థాలకు కారణం అహమే! అహం వల్ల అష్ట ఐశ్వర్యాలను పొగొట్టుకుని, అష్ట కష్టాలు అనుభవించినవారెందరో. తాజాగా కోట్ల విలువ చేసే గ్రాండ్ హోటెల్ యజమాని అయిన నా ముందు, ఓ చిరుద్యోగి సోఫాలో కూర్చోవడమా! అని తెగ ఈగో ఫీలైన ఓ మాజీ రాజకీయ నాయకుడు... ఆమెపై అమానవీయంగా దాడి చేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడు. సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాల్సి వచ్చింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అస్సాంలోని గౌహతి నగరంలో వెలుగుచూసింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నుర్జామాల్ సర్కార్ తనయుడు నికిబ్ జమాన్ గౌహతిలో గ్రాండ్ మెజిస్టీ పేరుతో ఓ బడా హోటల్‌ పెట్టాడు. దానికి ఎమ్‌డీ వ్యవహారిస్తూ నిత్యం హోటల్‌కు వెళ్లి వస్తుండేవాడు. అయితే మే 7న అతను హోటల్‌కు వచ్చే సమయానికి నకీబ్ జమాన్ ఛైర్‌కు ముందు ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది ‘ఓయో’ సంస్థకు చెందిన మహిళా ఉద్యోగిని.


తన ముందు అలా కూర్చున్న ఆమెను చూడగానే జమాన్ అహం దెబ్బతింది ... వెంటనే కోపంగా ఆమె దగ్గరకొచ్చి జుట్టుపట్టి లాగి కింద పడేశాడు. తర్వాత కాలితో తన్నుతూ దారుణంగా వ్యవహారించాడు. ఆమెపై అమానవీయంగా దాడికి దిగాడు. అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ఇదంతా పట్టనట్టు తన పనిలో తాను మునిగిపోగా... ఓ సీనియర్ ఉద్యోగి జమాన్‌ను అడ్డుకుని, నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. తర్వాత కింద పడి ఉన్న సదరు మహిళా ఉద్యోగికి చెయ్యిచ్చి లేపి కూర్చోబెట్టాడు. ఈ వ్యవహారమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మే 9న బసిస్తా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు నకీబ్ జమాన్. తానే మహిళా ఉద్యోగిపై దాడి చేసి కొట్టినట్టు ఒప్పుకున్నాడు జమాన్.

First published: May 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>