కార్వీ (Karvy) స్టాక్ బ్రోకింగ్ ద్వారా రూ.2,873 కోట్లు మోసాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు (ED Officials) తేల్చారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఇతర కంపెనీలకు ఎలా బదిలీ చేశారో గుర్తించారు ఈడీ అధికారులు.
కార్వీ (Karvy) స్టాక్ బ్రోకింగ్ ద్వారా రూ.2,873 కోట్లు మోసాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు (ED Officials) తేల్చారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఇతర కంపెనీలకు ఎలా బదిలీ చేశారో గుర్తించారు ఈడీ అధికారులు. కార్వీ గ్రూప్ (karvy Group) నుంచి 14 షెల్ కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు నిర్థారించారు. ఈ కేసులో కార్వీ చైర్మన్, ఎండీ పార్థసారథి, కృష్ణహరిలను ప్రధాన కుట్రదారులుగా గుర్తించామన్నారు. దీంతో ఇరువురిని అరెస్టు (Arrested) చేశారు. ఇదే కుంభకోణంలో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఇరువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నగదు మళ్లింపు కేసులో ఈడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్వీ ఎండీ పార్థసారథి , చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణా హరిని నాలుగు రోజులుగా ఈడీ అధికారులు విచారించారు. ఖాతాదారుల సెక్యూరిటీ Client Security)లను అక్రమంగా దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈడీ అధికారులు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. పార్థసారథి, ఆయన కుమారులు రజత్, అధిరాజ్‌లకు చెందిన కార్వీ గ్రూప్ షేర్లను ఈడీ స్తంభింపజేసింది.
చట్ట విరుద్దంగా తాకట్టు..
కార్వీ సంస్థ తన ఖాతాదారుల సెక్యూరిటీ (Securities)లను చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టి 329 కోట్ల రుణం తీసుకుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా ఈడీ.. పీఎంఎల్ఏ కింద ఈసీఐఆర్ జారీ చేసింది. ఇక, IndusInd Bankను రూ. 137 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు కార్వీ డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌ను రూ. 562 కోట్లు మోసం చేసినందుకు గానూ సైబరాబాద్ పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈడీ అధికారులు. కార్వీ చైర్మన్, ఎండీ పార్థసారథి, కృష్ణహరిలపై కేసులు నమోదు చేశారు. రుణాల ద్వారా పొందిన నగదును వ్యక్తిగత కంపెనీలకు బదిలీ చేశారని, రూ.700 కోట్లను పార్థసారథికి చెందిన షేర్ హోల్డింగ్ (Share Holdings)ను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. కాగా.. కార్వీ సంస్థ వందల కోట్ల రూపాయలను నిబంధనలను విరుద్దంగా దారి మళ్లించడంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టర్ల అనుమతి లేకుండా వారి షేర్లను.. కార్వీ కంపెనీ డీమ్యాట్ ఖాతాలోకి బదిలీ చేయడమేకాకుండా.. వాటిని బ్యాంకుతో తాకట్టు పెట్టి రుణాలు పొందింది.
అయితే ఆ రుణాలను అనుబంధ కంపెనీలకు మళ్లించినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన నిందితుల షేర్లను ఈడీ కొద్ది నెలల కిందట స్తంభింపజేసింది. కార్వీ సంస్థ తీసుకున్న మొత్తం రుణాలు దాదాపు 3,000 కోట్ల వరకు ఉంటాయని ఈడీ తెలిపింది. 2016-2019 మధ్యకాలంలో Karvy Stock Broking Limited తన గ్రూప్ కంపెనీ అయిన కార్వీ రియాల్టీ (ఇండియా)cheat లిమిటెడ్‌కు 1,096 కోట్లను బదిలీ చేసిందని ప్రాథమిక విచారణలో నిర్దారణ అయింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన పార్థసారథి సూచనల మేరకు యాంటీ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి సర్వర్ల నుంచి ఫైల్లు, ఈ మెయిల్స్‌ను తొలగించినట్లు ఈడీ తన విచారణలో కనుగొంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.