Home /News /crime /

ED IS LIKELY TO ISSUE NOTICES TO THREE TELANGANA MLAS AND A MINISTER IN THE CHIKOTI PRAVEEN CASINO CASE PRV

Casino case: క్యాసినో కేసులో ట్విస్ట్​.. ED విచారణకు ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఓ మంత్రి?

చికోటి ప్రవీణ్(file)

చికోటి ప్రవీణ్(file)

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నాలుగు రోజుల పాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ.. నలుగురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    సంచలనం సృష్టించిన క్యాసినో (Casino) వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నాలుగు రోజుల పాటు చికోటి ప్రవీణ్‌ (Cheekoti Praveen)ను విచారించిన ఈడీ (Enforcement Directorate) నలుగురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే సోమవారం నుంచి వారంతా ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం వుంది. చాలా మంది రాజకీయ ప్రముఖులను చికోటి విదేశాలకు తీసుకెళ్లినట్లుగా ఈడీ గుర్తించింది. మరోవైపు క్యాసినో వ్యవహారంలో హవాలా లావాదేవీలపై ఇంకా ఈడీ (ED) ఆరా తీస్తోంది. ప్రవీణ్ వాట్సాప్ చాటింగ్‌లో రాజకీయ ప్రముఖుల బండారం బయటపడినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్‌ మొబైల్‌ వాట్సాప్‌ మెసెంజర్‌లో తెలంగాణకు చెందిన ఓ మంత్రి (Minister), మరో ముగ్గురు ఎమ్మెల్యేలు (MLA) క్యాసినో వ్యవహారంలో చేసిన చాటింగ్‌ కీలకంగా మారినట్లు ఈడీ అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్‌ 10 నుంచి నేపాల్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంలో ఎక్కడ, ఎవరికి ఎంత డబ్బు డిపాజిట్‌ చేయాలనే అంశాలకు సంబంధించి వారి మధ్య జరిగిన చాటింగ్‌ వివరాలను ఈడీ గుర్తించినట్లు తెలిసింది.

    ఈ లావాదేవీల వ్యవహారం ఇప్పుడు మంత్రితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకొనేలా కనిపిస్తోంది. ప్రవీణ్, ఆ నలుగురి మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌లను రిట్రీవ్‌ చేసిన ఈడీ అధికారులు.. వాటిని తర్జుమా చేసి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారికి నోటీసులు ఇచ్చేందుకు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతి లభిస్తే మంత్రి, ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ సోమవారంలోగా అనుమతి వస్తే అదేరోజు లేదా మంగళవారం నుంచి ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేస్తామని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి.



    20 మంది వీఐపీలతో సంబంధాలు..

    కాగా, ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్​ తన కథనంలో.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది వీఐపీలతో ప్రవీణ్‌కు సంబంధాలు ఉన్నట్టుగా తెలిపింది. అందులో హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హైదరాబాద్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు , హైదరాబాద్‌లో తొలిసారిగా గెలిచిన ఓ ప్రజాప్రతినిధి, మెదక్ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. ఉన్నట్టుగా పేర్కొంది.

    వీరంతా చికోటీ నిర్వహించిన క్యాసినోకు వెళ్లారని.. ఈడీ అధికారులు వీరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చీకోటి ప్రవీణ్.. పలువురు ప్రముఖులతో ఉన్న ఫోటోలు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. దీంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఒకవేళ ప్రజాప్రతినిధులకు ఈడీ విచారణకు పిలిస్తే.. పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. రాజకీయంగా కీలక సమీకరణాలు చోటుచేసుకున్న అవకాశాలు లేకపోలేదు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Enforcement Directorate, Hyderabad, Police Case, Telangana

    తదుపరి వార్తలు