Home /News /crime /

ED IS INVESTIGATING THE TOP HEROINE IN THE DRUGS CASE AND STILL SUSPENSE OF WHAT IS HAPPENING PRV

Drugs case: డ్రగ్స్​ కేసులో టాప్​ హీరోయిన్​ను విచారిస్తున్న ఈడీ.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డ్రగ్స్, మనీలాండరింగ్ (money laundering) కేసులతో సెలబ్రెటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టాలీవుడ్(Tollywood), కోలీవుడ్( kollywood) ప్రముఖులను ఈడీ విచారిస్తోంది. బాలీవుడ్‏లో సైతం మనీలాండరింగ్ కేసులో భాగంగా తారలను విచారించే పనిలో పడింది ఈడీ. తాజాగా మనీలాండరింగ్ కేసులో సోమవారం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jaqueline Fernandez)‏ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఢిల్లీలో విచారించారు.

ఇంకా చదవండి ...
    మారుతున్న సాంకేతిక యుగంలో డ్రగ్స్(drugs)​ కూడా చేరాయి. ఒకప్పుడు ఎక్కడో నగరాలకు దూరంగా వ్యాపారం చేసుకునే డ్రగ్​ మాఫియా ఇపుడు పెద్దపెద్ద నగరాల్లోని పబ్(pub)​లు, ఇతర పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్​ అమ్మేస్తున్నారు. చాలాకాలంగా డ్రగ్స్​ను తుదముట్టించాలని అధికారులు ప్రయత్నిస్తున్నా.. మారుతున్న యుగంలో రెట్టింతలు పెరిగిపోయింది డ్రగ్​ మాఫియా. గత ఏడాది సుశాంత్​ కేసు నుంచి డ్రగ్స్​ విషయంలో పలువురు సెలబ్రెటీలపై అధికారులకు నోటీసులు జారీచేశారు. ఎందుకంటే డ్రగ్​ మాఫియా ఎక్కువగా సినీ పరిశ్రమలోనే ఉందనేది జగమెరిగిన సత్యం. అందుకే అధికారులు ఆయా సెలెబ్రెటీలను విచారణకు పిలుస్తున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా చిత్ర పరిశ్రమ(Cine industry)లోని ప్రముఖుల చుట్టూ వివిధ కేసులు తిరుగుతున్నాయి. డ్రగ్స్, మనీలాండరింగ్(money laundering) కేసులతో సెలబ్రెటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  టాలీవుడ్(Tollywood), కోలీవుడ్( kollywood) ప్రముఖులను ఈడీ విచారిస్తోంది. బాలీవుడ్‏లో సైతం మనీలాండరింగ్ కేసులో భాగంగా తారలను విచారించే పనిలో పడింది ఈడీ. తాజాగా మనీలాండరింగ్ కేసులో సోమవారం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jaqueline Fernandez)‏ను ఎన్‌ఫోర్స్‌మెంట్ (Enforcement Directorate) అధికారులు ఢిల్లీలో విచారించారు. దీంతో బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం కలిగింది. ఈ కేసులో జాక్వెలిన్‏తోపాటు.. ఇంకా పలువురు ప్రముఖులు విచారించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

    మానీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏ను దాదాపు ఐదు గంటలుగా విచారిస్తునే ఉన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలతోనే జాక్వెలిన్‏ను ఈడీ(ED) విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ(ED) వెల్లడించాల్సి ఉంది. ముంబయి(Mumbai)లోని ఇంట్లో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను సెప్టెంబర్‌ 1 వరకు ఎన్‌సీబీ కస్టడీలోకి తీసుకుంది.

    కొన్నేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటుల, దర్శకుల చుట్టూ డ్రగ్స్ రాకేట్ ఉచ్చు బిగుసుకుంది. అందులో స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలకి కూడా పాకింది. కన్నడలో అయితే ఏకంగా సంజన, రాగిణి ద్వివేది లాంటి హీరోయిన్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో టాలీవుడ్‌‌లో కూడా కొంత మంది నటీనటులు కొంత మంది విదేశీయలు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దానిపై అప్పట్లో చాలా పెద్ద విచారణ కూడా జరిగింది. నెల రోజుల పాటు వరసగా విచారించారు. ఒక్కొక్కొరని రెండు మూడు సార్లు కూడా విచారించారు అధికారులు. తాజాగా ఈడీ రంగంలోకి దిగడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. విచారణకు హాజరు కావాలంటూ హీరోయిన్లు ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్.. హీరోలు రవితేజ, రానా, తరుణ్, నవదీప్.. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు నందు, శ్రీనివాస్, ముమైత్ ఖాన్ సహా మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈ విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bollywood, Bollywood heroine, Drugs, Enforcement Directorate, Heroine, Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు