టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడీ కేసు

రవి ప్రకాశ్ (File)

గతేడాది అక్టోబర్‌లో దీనిపై పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ కేసు ఆధారంగానే తాజాగా ఈడీ వర్గాలు కేసు నమోదు చేశాయి.

  • Share this:
    టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. ఆయనపై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కేసు నమోదు చేసింది. రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు ఏబీసీఎల్ నుంచి 2018 నుంచి 2019 మధ్య కాలంలో రూ. 18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు గతంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. గతేడాది అక్టోబర్‌లో దీనిపై పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ కేసు ఆధారంగానే తాజాగా ఈడీ వర్గాలు ఈసీఐఆర్(ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశాయి.
    First published: