ED ATTACHES PROPERTIES OF MAHARASHTRA CM UDDHAV THACKERAY BROTHER IN LAW SHIVSENA NCP SLAMS BJP POLITICS MKS
ED | CM Uddhav: ఈడీ దూకుడు.. మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే బావమరిది ఆస్తులు సీజ్.. కలకలం..
మహా సీఎం ఠాక్రే బావమరిది ఆస్తులు సీజ్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలు మహారాష్ట్రలో రాజకీయ కలకలానికి దారి తీశాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సొంత బావమరిది శ్రీధర్ మాధవ్ పటాన్కర్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలు మహారాష్ట్రలో రాజకీయ కలకలానికి దారి తీశాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సొంత బావమరిది శ్రీధర్ మాధవ్ పటాన్కర్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో శ్రీధర్ కు సంబంధించిన 6.45 కోట్లను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులను మంగళవారం ప్రకటించారు.
సీఎం బావమరిదికి సంబంధించి ఈడీ సీజ్ చేసిన ఆస్తుల్లో 11 ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఇవి థానే దగ్గర నీలాంబరీ ప్రాజెక్టులోనివని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. కొన్ని రోజుల కిందటే మంత్రి ఆదిత్య థాకరేకు సంబంధించిన సన్నిహితుడు అనిల్ పరాబ్ నివాసాలపై ఈడీ సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే.
శ్రీధర్ మాధవ్ పటాన్కర్ స్వయానా ఉద్ధవ్ థాకరే భార్య రష్మికి సోదరుడు. కాగా, ఈడీ దాడులను రాజకీ ప్రతీకార దాడులుగా శివసేన ఆక్షేపించింది. ఠాక్రే సన్నిహిత బంధువులపై ఈడీ చర్యలకు దిగడాన్ని బీజేపీ ఆడుతోన్న రాజకీయ డ్రామాగా శివసేన అభివర్ణించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.