Home /News /crime /

చల్లగాలి కోసం కారులోంచి తల బయట పెట్టిన యువతి.. కానీ ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు

చల్లగాలి కోసం కారులోంచి తల బయట పెట్టిన యువతి.. కానీ ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు

ప్రతీకాతత్మక చిత్రం (Image:Shutterstock)

ప్రతీకాతత్మక చిత్రం (Image:Shutterstock)

చల్లగాలి కోసం లోహిత్ రాణి కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టారు. అదే సమయంలో కారు రోడ్డు అంచు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఆమె తల బలంగా తగిలింది. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమయింది.

  రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా..ప్రమాదాలు జరగొచ్చు. ప్రాణాలు పోవచ్చు. ముఖ్యంగా కారు, బస్సు వంటి వాహనాల్లో వెళ్తున్నప్పుడు కిటికీలో నుంచి చేతులు గానీ, తల గానీ బయట పెట్టకూడదు. ఎందుకంటే మనం ప్రయాణిస్తున్న వాహనం పక్క నుంచే ఇతర వాహనాలు వెళ్తాయి. అప్పుడు తల, చేతులు వాటికి తగిలి ప్రమాదం జరిగే అవకాశముంది. కేవలం వాహనాలే కాదు.. రోడ్డు పక్కన ఉండే మరేదైనా తగలవచ్చు. అందుకే అలర్ట్‌గా ఉండాలి. ఇలాగే ప్రమాదం బారినపడి ఏపీలో ఓ యువతి మరణించింది. చల్లగాలి కోసం కారులోంచి తల బయట పెట్టడంతో, రోడ్డపై ఉన్న విద్యుత్ స్తంభం తగిలి దుర్మరణం పాలయింది. తూర్పుగోదావరి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

  ఆ వయస్సున్న అమ్మాయితో శృంగారం రేప్​ కిందకే వస్తుంది..’’: మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లాలో ఓ స్నేహితురాలి వివాహానికి వేర్వేరు ప్రాంతాలు చెందిన ఎనిమిది మంది యువతీ యువకులు వచ్చారు. వీరిలో లోహిత్ రాణి అనే యువతి కూడా ఉంది. ఆమె స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం. లోహిత్‌ రాణితో పాటు మరో ఆరుగురు చెన్నైలో సీఏలుగా పనిచేస్తున్నారు. మరో ఇద్దరు బీటెక్‌ పూర్తి చేశారు. పెళ్లికి వచ్చిన స్నేహితులంతా గౌరీపట్నంలోని లోహిత్ రాణి ఇంట్లో బస చేశారు. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా..సరదాగా అలా విహారయాత్రకు వెళ్దామి నిర్ణయించుకున్నారు. గోదావరి జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే శనివారం గౌరీపట్నం నుంచి కారులలో మారేడుమిల్లికి బయలుదేరారు. ఐతే కారు మధురపూడి విమానాశ్రయం గేటు-బూరుగుపూడి గ్రామం మధ్య ప్రయాణిస్తుండగా.. లోహిత్ రాణి చల్లగాలి కోసం కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టారు. అదే సమయంలో కారు రోడ్డు అంచు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఆమె తల బలంగా తగిలింది. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమయింది.

  Shocking Incident: ఏం పనులమ్మా ఇవి.. మనింట్లో ఆడపిల్ల విషయంలో  ఒకలా.. బయట అమ్మాయి అయితే మరోలానా?

  ఆహె స్నేహితులు వెంటనే అదే కారులో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి ఆమె మృతి చెందినట్లు తెలిపారు. స్నేహితురాలి పెళ్లి కోసం వచ్చిన లోహిత్ రాణి.. ఊహించని ప్రమాదంలో మరణించడంతో స్నేహితులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె తల్లిదండ్రులు సర్వేశ్వరరావు, అనంతలక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారికి లోహిత్ రాణి ఒక్కరే సంతానం. పైగా వీరిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కూతురు మరణించడంతో ఇక తమకు దిక్కెవరని విలపిస్తున్నారు. పెళ్లి వారింట్లోనూ విషాద ఛాయలు అలుముుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు