Home /News /crime /

EAST GODAVARI CRIME NEWS WOMAN COMPLAINED POLICE MAN CHEATED HER NGS

Andhra Pradesh: మరి కొద్ది గంటల్లో పెళ్లి.. కానీ ఇంతలో వరుడుకి ఊహించని షాక్? ఏం జరిగిందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. వివాహ తంతు అంతా సందడిగా సాగుతోంది. మరికాసేపట్లో వధువు ఇంటికి వెళ్లేందుకు వరుడుతో సహా అంతా రెడీ అవుతున్నారు.. కానీ ఇంతలో ఊహించని ఘటన జరిగింది. దీంతో అప్పటి వరకు అక్కడే ఉన్న వరుడు పరారయ్యాడు..? ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

ఇంకా చదవండి ...
    ఓ కుటుంబ అప్పటి వరకు ఆనందంగా కనిపించింది.. కొడుకు పెళ్లి కావడంతో ఉదయం నుంచి దగ్గర బంధువుల రాకతో ఆ తల్లిదండ్రులు చాలా హ్యపీగా కనిపించారు. అంతా కలిసి మధ్యాహ్నం ఇంటి దగ్గర బంధుమిత్రులకు భోజనాలు పెట్టారు. అంతా హ్యాపీగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో పెళ్లి అని అంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కాసేపట్లో వధువు ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇంతలో ఆ ఇంటి తలుపు మోగింది. ఈ టైంలో ఎవరు వచ్చారు అని వెళ్లి తలుపు తీసిన వారికి మరో యువతి కనిపించింది. దీంతో అంతా షాక్ తిన్నారు...

    అక్కడికి వచ్చిన ఓ గిరిజన మహిళ.. పెళ్లికి రెడీగా ఉన్న ఆ వరుడితో తనకు ఆరేళ్ల కిందటే పెళ్లయిందని.. తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడని వాదనకు దిగింది. అక్కడకు వచ్చే ముందు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అక్కడితో ఆగలేదు. వరుడి ఇంటికి వచ్చి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయినా ఎవరూ పెద్దగా స్పందించకపోవడంతో అక్కడి నుంచి నేరుగా వధువు ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది.

    దీంతో వధువు కుటుంబీకులు సంకట స్థితిలో పడ్డారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఆగిపోయింది. అప్పటి వరకు అక్కడే కనిపించిన వరుడు.. విషయం అందిరికీ తెలియడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన భోగిశెట్టి వీర వెంకట అయ్యప్పస్వామి అనే వ్యక్తితో అయినవిల్లి మండలం విలసకు చెందిన దగ్గర బంధువైన ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. వీరి వివాహం శుక్రవారం రాత్రి వధువు ఇంటి దగ్గర జరగాల్సి ఉంది. శుక్రవారం ఉదయం అయ్యప్పస్వామి సొంతూరు చల్లపల్లిలో బంధుమిత్రులకు భోజనాలు పెట్టుకుని, వేడుక చేసుకున్నాడు. సాయంత్రం బంధువర్గంతో వధువు ఊరు విలసకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.

    సరిగ్గా అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల నుంచి రెండేళ్ల బాలుడితో ఓ గిరిజన మహిళ, తన బంధువులతో కలిసి కారులో ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. ఆమె ఆరోగ్య శాఖలో ఉద్యోగి. అయ్యప్పస్వామి తన భర్తని, తమకు ఓ కుమారుడు కూడా పుట్టాడని, అతడికి ఇప్పుడు వేరే పెళ్లి జరుగుతోందని, దీనిని ఆపాలని అభ్యర్థించింది. అయితే ఇందుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆమె, బంధువులు నేరుగా చల్లపల్లి వెళ్లారు. అయ్యప్పస్వామి బంధువులకు విషయం చెప్పారు. అక్కడి నుంచి విలస వెళ్లి వధువు ఇంట్లోనూ ఇదే విషయాన్ని వివరించారు. ఈ వివాదంతో మొత్తం మీద పెళ్లి ఆగిపోయింది. ఇప్పటికే ఆ గిరిజన మహిళ అయ్యప్పస్వామిపై రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది.

    అమలాపురంలో బహుజన మహిళా శక్తి సంస్థ జాతీయ అధ్యక్షురాలు కొంకి రాజామణిని కూడా ఆశ్రయించింది. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డిని కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టింది. ఆ గిరజన మహిళ శుక్రవారం తమ స్టేషన్‌కు వచ్చి అయ్యప్పస్వామి పెళ్లి ఆపాలని కోరిందని, అతడు ఆమె భర్తని తగిన ఆధారాలు చూపిస్తేనే చర్యలు చేపడతామని చెప్పానని ఉప్పలగుప్తం ఎస్సై వెంకటేశ్వరరావు చెప్పారు. ఆమె వారి పెళ్లి ఆధారాలు చూపించలేదని అన్నారు. దీంతో ఆమె, ఆమెతో పాటు వచ్చిన బంధువులు చల్లపల్లిలోని అయ్యప్పస్వామి ఇంటికి వెళ్లారని చెప్పారు. ఆ గిరిజన మహిళతో గతంలో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని.. అయితే తమ ఇద్దరికీ పెళ్లి జరగలేదని.. కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వరుడు అంటున్నాడు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Crime story, East Godavari Dist

    తదుపరి వార్తలు