Home /News /crime /

EAST GODAVARI CRIME NEWS FATHER RAPED HIS OWN DAUGHTER PRESET SHE IS 5 MONTHS PREGNANT NGS

Andhra Pradesh: కన్న కూతురిపై కన్నేసిన తండ్రి.. ఆస్పత్రికి వెళ్లడంతో విషయం తెలిసి షాక్

కూతురిపైనా కన్నేసిన తండ్రి

కూతురిపైనా కన్నేసిన తండ్రి

కరోనా కారణంగా పాఠశాలకు సెలవులు ఇవ్వడం ఓ కూతురికి శాపమైంది.. తండ్రి దగ్గర కొండత భరోసా ఉంటుందని దగ్గరకు వెళ్తే.. కళ్లు మూసుకుపోయిన ఆ తండ్రి కామాంధుడయ్యాడు.. కన్న కూతురిని ఆప్యాయంగా హత్తకోవాల్సిన వాడు.. నీచపు పనులు చేశాడు.. అయితే ఆరోగ్యం బాగులేదని ఆ కూతురు ఆస్పత్రికి వెళ్తేకానీ అసలు విషయం తెలియలేదు.

ఇంకా చదవండి ...
  కరోనా కారణంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వడం ఓ బాలికకు శాపమైంది.. కనుపాపలా కూతుర్ని కాపాడుకోవాల్సిన తండ్రే.. కామాంధుడయ్యాడు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న కూతురిపైనే మనసుపడ్డాడు.. ఆమ్మ ఇంటిలో లేని సమయంలో చూసుకుని కూతురుతోనే వెకిలి వేషాలు వేసేందుకు యత్నించాడు. ఇదేంటి నాన్నా అని ఆమె నిలదీస్తే మాయమాటలు చెప్పాడు.. ఈ విషయం ఎవరికైనా చెబితే తనతో పాటు అమ్మను కూడా చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఇలా పలుమార్లు కన్న కూతురిపై తన కామ వాంఛలు తీర్చుకున్నాడు. కూతురుని బెదిరించి ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తనకు కోరిక కలిగినప్పుడల్లా కూతురిపై ప్రతాపం చూపిస్తూ కీచకుడయ్యాడు. ఏం చేయలని ఆ బాలిక ఈ విషయం ఎవరికి చెప్పుకోలేకపోయింది. ఏ కూతురికైనా కష్టం వస్తే కన్న తండ్రికే చెప్పుకుంటుంది. కానీ ఆ తండ్రే అలాంటి పని చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటుంది..

  అయితే బాలిక కొన్ని రోజులుగా నీరసంగా ఉండడం.. ఆరోగ్యంలో మార్పులు గమనించిన తల్లి.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లంది. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి.. ఐదో నెల గర్భం అని చెప్పడంతో ఆ తల్లి అక్కడికక్కడే కూలబడిపోయింది. ఏం చేయాలో తెలియక.. కాసేపటి తరువాత షాక్ నుంచి తేరుకున్న తల్లి.. కూతురుని నిలదీసింది. దీంతో అసలు విషయం చెప్పింది ఆ కూతురు. అప్పటికే ఆస్పత్రికి వెళ్లడంతో పూర్తి సమాచారం తెలుసుకున్న తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు..

  బాలిక బంధువులు ఎస్సై డి రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని రాచంద్రాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి కరప మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. 12 ఏళ్ల క్రితం జీవనోపాది కోసం హైదరాబాద్ లోని ఫిల్మనరగ్ లోని ఓ అపార్ట్మెంట్ లో కాపాలదారుగా పనిలో కుదిరాడు. భార్య ఇళ్లలో పని చేస్తోంది. కుమారుడు అమ్మమ్మ గ్రామంలో ఉంటుండగా.. కుమార్తె హైదరాబాద్ లో 10వ తరగతి చదువుతోంది. కరోనా ప్రభావంతో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో బాలిక ఇంటి దగ్గరే ఉంటుంది. దీంతో కూతురుపై కన్నేసిన ఆ కామాంధుడు పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే తనను, అమ్మను పంపేస్తానని బెదిరించి పలు మార్లు అఘాయిత్యం చేశాడు.

  జరిగిన విషయాన్ని బాలిక తల్లి తన సోదరుడికి చెప్పింది. దీంతో ఆ కామాంధుడి కోసం గాలింపు చేపట్టగా.. కరప మండలంలోనే ఒక చోట తలదాచుకున్నట్టు గుర్తించారు. అక్కడికి వారు వెళ్లిన వెంటనే వారిని చూసి పరుగులు పెట్టాడు. వెంబడించిన వారు అతడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పచెప్పారు. ఇటీవల ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని ఓ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కన్న కూతురునే చరిచాడు ఓ కసాయి తండ్రి.. ఆ ఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, East Godavari Dist

  తదుపరి వార్తలు