హోమ్ /వార్తలు /క్రైమ్ /

Video : రావణ దహనంలో అపశృతి.. జనంపై కూలిన కాలుతున్న రావణుడి బొమ్మ

Video : రావణ దహనంలో అపశృతి.. జనంపై కూలిన కాలుతున్న రావణుడి బొమ్మ

జనం పడిన కాలుతున్న రావణుడి బొమ్మ

జనం పడిన కాలుతున్న రావణుడి బొమ్మ

Ravan Effigy Falls On Visitors : హర్యానా(Haryana)లోని యమునానగర్‌లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం యమునానగర్ గ్రౌండ్ లో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు మైదానంలోకి చేరుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Ravan Effigy Falls On Visitors : హర్యానా(Haryana)లోని యమునానగర్‌లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం యమునానగర్ గ్రౌండ్ లో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు మైదానంలోకి చేరుకున్నారు. రావణ దహనం మొదలైంది. రావణుడి దిష్టి బొమ్మకు(Ravan Effigy) నిప్పు పెట్టారు. దాదాపుగా పైవరకు మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో గాలి వీయడంతో కుదుపునకు గురైన రావణుడి బొమ్మ తగలబడుతున్న మంటలతోనే ఒక పక్కకు ఒరిగి కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయాలయ్యాయి. అప్పటి వరకు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ అతి సమీపంలో నిలబడి రావణ దహనం వీక్షిస్తున్న జనం అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ రావణుడి బొమ్మ కూడా అతి ఎత్తులో ఉండటంతో దాని పొడవును దాటుకుని తప్పించుకుని పోలేకపోయారు.

బొమ్మ కింద మంటల్లో చిక్కుకుపోయిన వారిని స్థానికులు ప్రాణాలకు తెగించి బయటికి లాక్కొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పి గాయాలతో బయటపడ్డారు. లేదంటే ఊహించని నష్టం జరిగిపోయి ఉండేది. ఇక,ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.  రాముడు రావణుడిని వధించిన రోజుని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని దసరా సందర్భంగా రాక్షస రాజు రావణుడు, అతని కుమారుడు మేఘనాద్, సోదరుడు కుంభకరుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారన్న విషయం తెలిసిందే.

Offshore wind projects : సముద్రతీర భూమిని లీజుకి ఇవ్వడానికి కేంద్రం ప్లాన్స్

మరోవైపు,దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున వెస్ట్ బెంగాల్(West Bengal) లో విషాదం చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లాలోని మాల్​బజార్​ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు స్థానికులు అనేక మందికి మాల్​ నదికి వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఓ చిన్న దీవి లాంటి ప్రదేశంలో నిల్చుని విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. మాల్ నదిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేస్తుండగా చూస్తుండగానే కళ్లముందు క్షణాల వ్యవధిలో వరద ఉదృతి పెరిగింది. ఎగువ నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తి దీవిని ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో జనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో 8 మంది నీట మునిగి మ‌ర‌ణించ‌గా ప‌లువురు గల్లంతయ్యారని తెలుస్తోంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Haryana

ఉత్తమ కథలు