కాలేజీ రోజుల్లో ప్రేమ పేరుతో కామ కోరికలు తీర్చుకున్నాడు..పెళ్లయినా వదలకుండా...యువతిని వేధించి

ఇంతలో సరిగ్గా మూడు నెలల క్రితం సోనం ఫోన్ కు ఓ వాట్సప్ వీడియో మెసేజ్ రూపంలో వచ్చింది. అది ఓపెన్ చేసిన సోనం వణికి పోయింది. అందులో ఆమె తన మాజీ ప్రియుడు ప్రణవ్ తో కలిసి సెక్స్ చేస్తూ ఉంది. ఆ వీడియో తన భర్త కంట పడితే ఇక తన జీవితం నాశనం అయిపోతుందని ఆమెకు అర్థం అయ్యింది.

news18-telugu
Updated: October 17, 2020, 9:03 PM IST
కాలేజీ రోజుల్లో ప్రేమ పేరుతో కామ కోరికలు తీర్చుకున్నాడు..పెళ్లయినా వదలకుండా...యువతిని వేధించి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాలేజీలో చదివే రోజుల్లో అతడి మాటలకు ఆకర్షితురాలైంది. అతడే ప్రాణమనుకుంది. ప్రేమలో మునిగితేలింది. స్నేహితుడని నమ్మింది. చివరకు అతను ఆమెతో లైంగిక సుఖాలు తీర్చుకొని వదిలేశాడు. అంతటితో ఆగలేదు... ఏకంగా ఆ దృశ్యాలను సెల్ ఫోన్ కెమెరాతో చిత్రించాడు. పెళ్లి అయిన తర్వాత కూడా తన కోరిక తీర్చాలని లేకుంటే ఆ వీడియోను నెట్లో పెట్టి పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో ఆ వివాహిత కీచకుడి బారిన పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన సోనం ( పేరు మార్చాం) మూడేళ్ల క్రితం తన కాలేజీ క్లాస్ మేట్ ప్రణవ్ ను ప్రేమించింది. ఇద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేవారు. ఈ క్రమంలోనే ప్రణవ్ సోనంతో చాలా సన్నిహితంగా మెలిగేవాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడి మాటలను సోనం అమాయకంగా నమ్మింది. దీంతో ప్రణవ్ ఆమెను తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి కామవాంఛలు తీర్చుకోవడం స్టార్ట్ చేశాడు. తొలుత సోనం భయపడినప్పటికీ, ప్రణవ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె అతడి దుశ్చర్యలను భరించింది. ఇంతలో సోనం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఆ విషయం ప్రణవ్ కు చెప్పింది. అయితే కేవలం సోనం శరీరాన్ని మాత్రమే ప్రేమించిన ప్రణవ్ ఆమెను వాడుకొని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని బిచాణా ఎత్తేశాడు. ప్రణవ్ మోసాన్ని గ్రహించిన సోనం, తన తల్లిదండ్రులు చూపిన సంబంధం చేసుకుంది.

తన సమీప బంధువు రాకేష్ తోనే వివాహం జరిగింది. ఏడాది పాటు అంతాసజావుగానే సాగింది. ఇంతలో సరిగ్గా మూడు నెలల క్రితం సోనం ఫోన్ కు ఓ వాట్సప్ వీడియో మెసేజ్ రూపంలో వచ్చింది. అది ఓపెన్ చేసిన సోనం వణికి పోయింది. అందులో ఆమె తన మాజీ ప్రియుడు ప్రణవ్ తో కలిసి సెక్స్ చేస్తూ ఉంది. ఆ వీడియో తన భర్త కంట పడితే ఇక తన జీవితం నాశనం అయిపోతుందని ఆమెకు అర్థం అయ్యింది. ఇంతలో ప్రణవ్ స్వయంగా ఫోన్ చేసి సోనంను బ్లాక్ మెయిల్ చేశాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే... ఆ వీడియోను ఆమె భర్తకు పంపుతానని బ్లాక్ మెయిల్ చేశాడు.

ఆ కామంధుడు వివాహమైనా సోనంను వదిలిపెట్టలేదు. వివాహం తరువాత కూడా భర్త ఉద్యోగానికి వెళ్ళగానే ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. వీడియో పేరుతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ సోనంతోనే తన కామ వాంఛలు తీర్చుకోవడం ప్రారంభించాడు. సోనం తనతో పాటు ప్రేమాయణం నడిపినప్పటి అశ్లీల వీడియోలను ఆమెకు పంపిస్తూ నిత్యం వేధింపులకు గురిచేశాడు. ఇక సోనం ప్రణవ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. సూసైడ్ లెటర్ లో తనకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. కాగా సోనం ఆత్మహత్యాయత్నాన్ని ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో చేర్పించారు. అంతేకాదు నిందితుడు ప్రణవ్ పైపోలీసులుకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులో తీసుకున్నారు.
Published by: Krishna Adithya
First published: October 17, 2020, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading