Food Delivery App: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన మోడల్‌కు షాకింగ్ అనుభవం.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు..

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన మోడల్‌కు షాకింగ్ అనుభవం

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వేళ చాలా మంది ఆన్‌లైన్‌లోన ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు.

  • Share this:
    ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వేళ చాలా మంది ఆన్‌లైన్‌లోన ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈ సేవలకు డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె ఖాతా నుంచి వేలాది రూపాయలు అదృశ్యమయ్యాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని డమ్‌డమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివారలు.. శతరూప దాస్ అనే యువతి వృత్తి రీత్యా మోడల్‌. ఆమె శుక్రవారం రోజులు ఓ ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరి యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశారు. ఇందుకోసం ఆమె ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించింది. అయితే చాలా సమయం గడిచినప్పటికీ ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ కాలేదు.

    దీంతో ఆమె యాప్‌లో చూపెడుతున్న ఫుడ్ డెలివరీ బాయ్ నెంబర్‌కు కాల్ చేసింది. అయితే అతడు ఫుడ్ డెలివరీ చేయలేనని చెప్పాడు. దీంతో శతరూప దాస్ తన ఆర్డర్‌ను రద్దు చేయాలని భావించింది. దీంతో ఆమె ఫుడ్ డెలివరీ సంస్థ హెల్ఫ్‌లైన్ నెంబర్‌కు కాల్ చేశానని శతరూప దాస్ చెప్పింది. ఈ విషయంపై వారికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరినట్టు తెలిపింది. వారు చెప్పినట్టు కోడ్‌ స్కాన్ చేయగానే.. తన అకౌంట్ నుంచి ఐదు దశల్లో మొత్తం రూ. 25 వేలు డెబిట్ అయ్యాయని ఆమె పేర్కొంది.

    తన డబ్బులు తిరిగి ఇస్తామనే పేరుతో మోసం చేసి రూ. 25వేలు దోచుకున్నారని శతరప దాస్ ఆరోపించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..‘డెలివరీ యాప్ కంపెనీ ఉద్యోగుల్లో కొందరు ఈ మోసానికి పాల్పడ్డారు. ఉద్యోగుల పాత్ర లేకపోతే నా నెంబర్ వారి వద్దకు ఎలా చేరుతుంది..?. తనతో మాట్లాడిన వ్యక్తి హిందీలో మాట్లాడాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు ఈ కేసను దర్యాప్తు చేస్తున్నారు’అని తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: