• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DUE TO FINANCIAL CRISIS 4 FROM MAHARASHTRA TRY TO STEAL STEAL ASHES FROM WOMANS PYRE BA

దరిద్రానికి పరాకాష్ట.. పాపం డబ్బుల కోసం ఆస్థికలు, బూడిద చోరీ.. వాటితో ఏం చేశారంటే..

దరిద్రానికి పరాకాష్ట.. పాపం డబ్బుల కోసం ఆస్థికలు, బూడిద చోరీ.. వాటితో ఏం చేశారంటే..

చితిమంటలు (ప్రతీకాత్మక చిత్రం)

డబ్బు కోసం ఎవరైనా ఏం చేస్తారు. మామూలుగా అయితే పని చేస్తారు. కొందరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తారు. కొందరు మాత్రం దొంగతనాలు మోసాలు చేస్తారు. అయితే, వీరు తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో డబ్బు కోసం వారు ఏకంగా అస్థికలు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు.

  • Share this:
    డబ్బు కోసం ఎవరైనా ఏం చేస్తారు. మామూలుగా అయితే పని చేస్తారు. కొందరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తారు. కొందరు మాత్రం దొంగతనాలు మోసాలు చేస్తారు. అయితే, వీరు తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో డబ్బు కోసం వారు ఏకంగా అస్థికలు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. చనిపోయిన వారి అస్థికల్లో ఏముంటుంది బూడిద అనుకోవద్దు. వారు అస్థికలు, బూడిద చోరీ చేయడం వెనుక కూడా చాలా పెద్ద కథ ఉంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఉస్మానాబాద్ జిల్లాలోని దేవ్ గావ్ గ్రామంలో జరిగింది. షోలాపూర్ జిల్లాలోని బార్లోని గ్రామానికి చెందిన నలుగురు దాదాసాహెబ్ హన్వాతే, ఆయన భార్య రుక్మిణి, రామచంద్ర కసాబే, అతడి భార్య స్వాతి ఇటీవల వారి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. చేతిలో డబ్బులేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. వారికి ఓ విషయం తెలిసింది. దేవ్ గావ్ గ్రామంలో ఓ మహిళ ఫిబ్రవరి 22న చనిపోయింది. ఆమె డెలివరీ సమయంలో ప్రాణాలు కోల్పోయింది. ఆ మహిళను ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలతో సహా దహనం చేస్తున్నారని తెలిసింది.

    ఆ బంగారు ఆభరణాలు కూడా దహనం చేస్తున్నారు కాబట్టి వాటిని తీసుకోవచ్చని వారు ఆశించారు. అయితే, ఆ మంటల్లో పడి బంగారం కూడా కరిగిపోతుందని భావించారు. అయితే, అందుకు వారు ఓ ఎత్తుగడ వేశారు. శవం కాలిన బూడిదను సేకరించి దానిలో నుంచి మళ్లీ బంగారాన్ని వేరు చేయవచ్చని ప్లాన్ వేశారు. గ్రామస్తులు ఆ మహిళ శవాన్ని దహనం చేసి అంత్యక్రియలు చేసి వెళ్లిపోయారు. అనంతరం ఈ నలుగురూ వచ్చి అక్కడ అస్థికలు, బూడిదను సేకరించడం మొదలు పెట్టారు. అస్థికలు సేకరించేందుకు వచ్చిన ఆ మహిళ కుటుంబసభ్యులు దీన్ని గమనించారు. ఏదో అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. గ్రామస్తులు అందరూ వారిని పట్టుకుని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు