news18-telugu
Updated: November 22, 2020, 11:54 AM IST
కరీంనగర్లో వ్యక్తి దారుణ హత్య... ఆ సంబంధమే కారణమా?
కరీంనగర్ రూరల్ మండలం... బొమ్మకల్లో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. రూరల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... కార్ఖానా గడ్డకు చెందిన వలీం పాషా (48) మాంసం అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు. శనివారం రాత్రి బొమ్మకల్ మద్యం దుకాణం దగ్గర్లో వలీంపాషా ఉన్నట్లు తెలుసుకున్నారు కార్ఖానా గడ్డకు చెందిన సయ్యద్ అఫ్జల్, మరో వ్యక్తి. ఎప్పటి నుంచో వీలం పాషాను చంపేయాలనుకుంటున్న వాళ్లిద్దరూ... ఆ రాత్రి సమయంలో హత్య చేస్తే... ఎవరూ గుర్తు పట్టరని అనుకున్నట్లు తెలిసింది. వెంటనే వెళ్లి... తమతో కత్తులు తెచ్చుకున్నారు. వలీం పాషా... ప్రజల మధ్య ఉండటంతో... కాసేపు ఎదురు చూశారు. ఆ తర్వాత... చీకట్లో వలీం ఒక్కడే ఉండటాన్ని చూశారు.
అటువైపు తిరిగి ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా... వెనక నుంచి వాళ్లు వెళ్లారు. ఇంతలో... వలీం వెనుక నుంచి... ఓ కత్తి... శరీరాన్ని చీల్చుకుంటూ... ముందుకొచ్చింది. అంతే... వలీం చేతిలో మొబైల్ కిందపడింది. ఆ తర్వాత... ఆ తర్వాత వరుసగా కత్తులతో పొడిచి... అత్యంత దారుణంగా చంపేశారు. వలీం చనిపోయాడని నిర్ధారించుకున్నాక... అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల ద్వారా పోలీసులకు ఈ హత్య విషయం తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి... మర్డర్ కేసు నమోదు చేశారు. స్థానికులను వివరాలు అడగడం ద్వారా... హత్య చేసింది సయ్యద్ అఫ్జల్, మరో వ్యక్తి అని భావిస్తున్నారు. ఈ హత్యకు వలీం పాషా పెట్టుకున్న వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇది కూడా చదవండి: Annual Darkness: ఆ టౌన్లో 2 నెలలపాటూ కనిపించని సూర్యుడు... ఎందుకు?
పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. పరారీలో ఉన్న నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామంటున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
November 22, 2020, 11:54 AM IST