‘దృశ్యం’ సినిమా చూసి హత్య... ప్రియురాలిని చంపేసిన బీజేపీ నేత... మృతదేహాన్ని పూడ్చేసి...

తన కంటే 43 ఏళ్లు చిన్నదైన యువతితో లైంగిక సంబంధం పెట్టుకున్న బీజేపీ నేత... మృతదేహం ఆనవాళ్లు తేలియకుండా ‘దృశ్యం’ సినిమా చూసి స్కెచ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 10:06 PM IST
‘దృశ్యం’ సినిమా చూసి హత్య... ప్రియురాలిని చంపేసిన బీజేపీ నేత... మృతదేహాన్ని పూడ్చేసి...
హిందీ ‘దృశ్యం’ మూవీ స్టిల్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 10:06 PM IST
మలయాళంలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా, తమిళంలో కమల్ హాసన్ హీరోగా, హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా ఇదే సినిమాలో రీమేక్ చేయబడి ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ఓ యువకుడిని పొరపాటున హత్య చేసి, శవాన్ని భూమిలో పాతిపెడతారు. ఆ తర్వాత అదే ప్లేసులో ఓ కుక్క కళేబరాన్ని పాతిపెడతారు. అచ్ఛం ఇలాంటి హత్యే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇండోర్ నగరానికి చెందిన ట్వింకిల్ అనే 22 ఏళ్ల యువతి... రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... తాజాగా విచారణలో ఆమె హత్యచేసినట్టు తేల్చారు. ఈ హత్యలో ఓ బీజేపీ నేత హస్త ఉండడం విశేషం. ఇండోర్ మాజీ కౌన్సిలర్ జగదీశ్ కరోటియా అనే 65 ఏళ్ల బీజేపీ నేత... 22 ఏళ్ల ట్వింకిల్‌కి మధ్య వివాహేతర సంబంధం ఉంది.

తన కంటే 43 ఏళ్లు చిన్నదైన యువతితో లైంగిక సంబంధం పెట్టుకున్న జగదీశ్‌కు, అతని ముగ్గురు కొడుకులకీ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో తమ మధ్య గొడవలకు కారణమవుతున్న ఆమెను చంపేయాలని పథకం పన్నారు నలుగురు. అప్పుడే విడుదలైన ‘దృశ్యం’ సినిమాను చూసి... అందులో హీరో చేసినట్టుగానే చేయాలని పక్కా ప్లాన్ గీసుకున్నారు. అనుకున్నట్టుగానే ట్వింకిల్‌ను చంపేసి... కాల్చివేశారు. ఆమె ఆనవాళ్లు దొరకకుండా అదే ప్రదేశంలో ఓ కుక్కను చంపేసి పూడ్చి పెట్టారు. అక్కడ మనిషి శవాన్ని పూడ్చిపట్టారన్నట్టు పుకార్లు కూడా సృష్టించారు. మిస్సింగ్ కేసులో భాగంగా డాగ్ స్వ్కాగ్‌తో తనిఖీ చేసిన పోలీసులు... అక్కడ తవ్వగా కుళ్లిపోయిన కుక్క కళేబరం కనిపించింది. రెండేళ్లుగా కేసు పక్కదారి పట్టించారు. అయితే ఖననం చేసిన దగ్గర ట్వింకిల్ ధరించిన బంగారు ఆభరనాల ఆనవాళ్లు ప్రదేశంలో దొరకడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువతిని హత్య చేసి ఖననం చేసిన జగదీశ్, అతని కొడుకులు అజయ్, విజయ్, వినయ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు... రెండేళ్ల తర్వాత కేసును చేధించారు.

ఇవి కూడా చదవండి...

బైకర్ తల మీద నుంచి దూసుకెళ్లిన ట్రక్కు... అయినా క్షేమంగా బయటికి... వీడియో వైరల్...
బీహార్‌లో మరో ‘పరువు హత్య’... 16 ఏళ్ల బాలిక తల నరికి... అతి దారుణంగా...


‘యూట్యూబ్ చోరులు’... వీడియోలు చూసి బైక్‌లు కాజేస్తున్న కాలేజ్ స్టూడెంట్స్...


‘కిడ్నీలు అమ్మేందుకు వచ్చా...’ బంగ్లాదేశీ వలసదారుడి వింత సమాధానం...

Loading...

స్వీట్లు, స్నాక్స్ ఇచ్చి 12 ఏళ్ల మైనర్‌పై 3 నెలలుగా అత్యాచారం... గర్ల్‌ఫ్రెండ్ అనుమానంతో...

First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...