అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు.. సంగారెడ్డిలో దారుణం

రాత్రి అన్న ఇంటికి వెళ్లిన చిట్టిబాబు, నిద్రలో ఉన్న అమరేందర్‌పై దాడిచేశాడు. రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

news18-telugu
Updated: November 21, 2019, 6:26 PM IST
అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు.. సంగారెడ్డిలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మద్యం మత్తులో సొంత అన్నను చంపేశాడు తమ్ముడు. క్షణికావేశంలో అతి కిరాతకంగా హతమార్చాడు. రోకలి బండతో తలపై మోది సోదరుడిని అంతమొందించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. అమరేందర్ (35), చిట్టిబాబు అన్నాదమ్ముళ్లు. బుధవారం బంధువుల ఇంట్లో నిశ్చితార్థానికి హాజరయ్యారు. అనంతరం విందులో పాల్గొని పీకలదాకా మద్యం తాగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లారు.

ఐతే బంధువులు కలగజేసుకొని సర్దిచెప్పడంతో ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి అన్న ఇంటికి వెళ్లిన చిట్టిబాబు, నిద్రలో ఉన్న అమరేందర్‌పై దాడిచేశాడు. రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిట్టిబాబును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అమరేందర్ మృతిలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading