భార్య ఉద్యోగం తెచ్చుకోలేదని.. నాలుగేళ్ల కూతురిని హింసించిన ప్రబుద్ధుడు

భార్య ఉద్యోగం సంపాదించలేదనే కోపాన్ని ఓ వ్యక్తి కూతుళ్లపై చూపెట్టాడు. చిన్నారి అని కూడా చూడకుండా ముఖంపై ఉమ్మాడు. ఈ అమానవీయ ఘటన తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: September 26, 2020, 7:54 AM IST
భార్య ఉద్యోగం తెచ్చుకోలేదని.. నాలుగేళ్ల కూతురిని హింసించిన ప్రబుద్ధుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్య ఉద్యోగం సంపాదించలేదనే కోపాన్ని ఓ వ్యక్తి కూతుళ్లపై చూపెట్టాడు. చిన్నారి అని కూడా చూడకుండా ముఖంపై ఉమ్మాడు. ఈ అమానవీయ ఘటన తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్‌కు చెందిన బస్ కండెక్టర్ అజీముద్ధీన్‌కు భార్య ఇద్దరు అమ్మాయిలు. అయితే ప్రతి రోజు తాగి ఇంటికి రావడం అలవాటుగా మారింది. ఇంటికి రాగానే భార్యతో గొడవపడటం.. చిన్నారులను బెదిరింపులకు గురిచేయడం అతనికి సర్వసాధారణం అయిపోయింది. భార్య ఉద్యోగం సంపాదించలేదనే కోపంలో ఆమెపై పలు మార్లుదాడికి దిగాడు. చిన్నారులు భయపడి దాక్కునేందకు యత్నిస్తే.. గొంతు కోస్తానని బెదిరించేవాడు. అంతేకాకుండా బూతులు తిట్టేవాడు.

ఇటీవల కూడా పూర్తిగా తాగిన మత్తులో ఇంటికి వచ్చిన అజీముద్దీన్ భార్యను విచక్షణ లేకుండా తీవ్రంగా కొట్టాడు. ఇంట్లో నుంచి ఆమె పారిపోవాలని యత్నించడంతో.. రెండో కుమార్తెను పట్టుకుని కొట్టాడు. అలాగే చిన్నారి ముఖంపై అదే పనిగా ఉమ్మడం చేశాడు. దీని వీడియో తీసిన అజీముద్దీన్ భార్య,.. తల్లిదండ్రులకు చూపించింది. అయితే వారు కూడా ఆమెకు మద్దుతుగా నిలవలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అజీముద్దీన్‌ను అరెస్ట్ చేశారు. తల్లి ఇద్దరకు కూతుళ్లను ప్రభుత్వ ఆధర్వ్యంలో సఖి కేంద్రానికి పంపించారు.

పోలీసు కథనం ప్రకారం.. "అజీముద్దీన్ తన భార్య ఉద్యోగం సాధించలేదనే కోపంతో ఉన్నాడు. వీరికి 2014లో వివాహం అయింది. అయితే ఆమె టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేయడంతో.. ఉద్యోగం సాధిస్తుందనే ఆశతోనే అజీముద్దీన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు ఉద్యోగం రాలేదు. మరో వైపు ఇద్దరు కూతుళ్లు కావడంతో రోజు వారిపై దాడి చేసేవాడు" అని తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 7:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading