Home /News /crime /

DRUNKEN HUSBAND FEARING THAT HIS WIFE WOULD BE SCOLDED IF HE WENT HOME CALLED HIS WIFE AND TOLD HER A LIE SSR

Viral: ఫుల్లుగా తాగిన భర్త.. ఇంటికెళితే భార్య ఇలా కొడుతుందని భయపడి చెప్పిన ఒక్క అబద్ధం వల్ల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొందరు భర్తలు మందుపై ఉన్న మక్కువతో భార్యకు తెలియకుండా మద్యం తీసుకుంటుంటారు. మరికొందరు తాగి ఇంటికెళితే భార్య తిడుతుందని.. తాగేసి వెళ్లినా ఆమెకు అనుమానం రాకుండా ఉండేందుకు నానా తిప్పలు పడుతుంటారు.

    నాగ్‌పూర్: కొందరు భర్తలు మందుపై ఉన్న మక్కువతో భార్యకు తెలియకుండా మద్యం తీసుకుంటుంటారు. మరికొందరు తాగి ఇంటికెళితే భార్య తిడుతుందని.. తాగేసి వెళ్లినా ఆమెకు అనుమానం రాకుండా ఉండేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఇలా తాగుబోతు భర్తలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా భార్యలకు తెలియకుండా పెగ్గేస్తుంటారు. ఇలా మద్యానికి బానిసైన నాగ్‌పూర్‌కు చెందిన ఓ భర్త ఉదయం నుంచి బాగా తాగాడు. తాగుతూనే ఉన్నాడు. రాత్రయింది. ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అంత ఫుల్లుగా తాగేసిన స్థితిలో ఇంటికెళితే భార్య తిట్టడమే కాదు కొట్టినా కొడుతుందని భయపడ్డాడు. భార్యంటే ఆ భర్తకు అంత భయం. ఆ రాత్రి ఇంటికి వెళ్లకుండా ఉండేందుకు భార్యకు అతను చెప్పిన అబద్ధం 600 మంది పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగినంత పనిచేసింది.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన గజేంద్ర ఖోరే(26) అనే వ్యక్తి పని వెతుక్కునేందుకు భార్య సురేఖతో కలిసి నాగ్‌పూర్‌కు వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పని దొరకడంతో కాపురం పెట్టాడు. గజేంద్ర రోజూలానే గత మంగళవారం ఉదయం కూడా బైక్‌పై పని మీద బయటకు వెళ్లాడు. వెళుతూ.. త్వరగానే వస్తానని భార్యకు చెప్పాడు. అలా వెళ్లిన వాడు సాయంత్రం అవుతున్నా తిరిగి రాలేదు. ఒకానొక సమయానికి భార్య సురేఖ‌కు ఫోన్ చేసిన గజేంద్ర బైక్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు. అంతేకాకుండా.. తన బైక్‌ను ఢీకొట్టిన కారులో నుంచి దిగిన కొందరు తనను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి కట్టేసి కొట్టారని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత సురేఖ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో.. తన భర్తకు ఏమైందోనని.. ఎవరో కిడ్నాప్ చేశారని భావించిన సురేఖ వెంటనే వెళ్లి తన భర్తను కిడ్నాప్ చేశారని.. ఫోన్ చేస్తే స్విఛ్ ఆఫ్ వస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

    ఇది కూడా చదవండి: Wife: భర్తతో కలిసి ఇంత హ్యాపీగా కనిపిస్తున్న ఈమెకే ఎందుకిలా జరిగిందో పాపం..

    మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు. దాదాపు 600 మంది పోలీసులు ముగ్గురు డీసీపీ ర్యాంకు అధికారులు ఈ కేసు పరిష్కారానికి రాత్రంతా నానా తిప్పలు పడ్డారు. కానీ.. గజేంద్రకు సంబంధించి ఒక్క ఆధారం దొరకలేదు. నిట్టూరుస్తూ భర్త కోసం బెంగపెట్టుకున్న సురేఖ‌కు మరుసటి రోజు ఉదయం ఓ విషయం తెలిసింది. ఉదయం 7.30కు గజేంద్ర అతని ఫ్రెండ్‌కు ఫోన్ కాల్ చేశాడు. తాను మద్యం అతిగా తాగానని.. రాత్రంతా ఎక్కడో తాగి పడిపోయి నిద్రపోయానని గజేంద్ర అతనికి చెప్పాడు. తన భార్యకు భయపడి ఇంటికెళ్లలేక కిడ్నాప్ అయినట్లు అబద్ధం చెప్పానని చెప్పాడు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి గజేంద్ర భార్యకు చేరవేశాడు. ఆమె పోలీసులకు జరిగిన విషయం చెప్పింది. అది విన్న పోలీసులు షాకయ్యారు. రాత్రంతా తమను ముప్పతిప్పలు పెట్టి తాగి ఎక్కడో పడుకున్న గజేంద్ర కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఉదయం 9.30కు గజేంద్ర ఇల్లు చేరాడు. పోలీసులు మళ్లీ ఇలా ఎప్పుడూ చేయొద్దని హెచ్చరించారు. గజేంద్ర ఇంటికి రావడంతో అతని భార్య సురేఖ హమ్మయ్య అనుకుంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Husband, Kidnap, Liquor, Phone calls, Wife

    తదుపరి వార్తలు