• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DRUNK MAN ELIMINATED HIS WIFE AT KANDUKUR IN RANGAREDDY DISTRICT VB

Murder: కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త.. నిద్రిస్తుండగా గొడ్డలితో దాడి.. అనంతరం మామిడి తోట పొదల్లో..

Murder: కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త.. నిద్రిస్తుండగా గొడ్డలితో దాడి.. అనంతరం మామిడి తోట పొదల్లో..

ప్రతీకాత్మక చిత్రం

Murder: మద్యం మత్తు ఆ కుటుంబానికి శాపంగా మారింది. తాగుడుకు బానిసగా మారిన భర్త తన కూతురు కళ్లెదుటే తల్లిని గొడ్డలి తో నరికి చంపేశాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    ఎప్పటిలాగే ఉదయం లేచి ఇంట్లో పనులు చేసింది ఓ ఇల్లాలు. తన భర్తను పనికి పంపించింది. తన కూతురుని, కుమారుడిని ఇంటి వద్దే ఉండమని చెప్పి తను కూడా కూలికి వెళ్లింది. సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చిన తల్లి వాళ్లకు అన్నం పెట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న తన భర్త ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. ఆమె అతడి కోసం వేచి చూసింది. ఎప్పటికి రాకపోవడంతో తను కూడా అన్నం తిని పడుకుంది. రాత్రి దాదాపు 11.40 గంటల సమయంలో తన భర్త ఇంటికి వచ్చాడు. ఇద్దరి పిల్లలతో పాటు భార్య కూడా పడుకున్నది గమనించాడు. తాగిన మైకంలో ప్రతి నిత్యం ఎదో ఒక గొడవ కుటుంబంలో జరిగేది. కానీ ఈ సారి తన భార్యను నిద్ర నుంచి లేపే ప్రయత్నం చేయకుండానే గొడ్డలితో నరికాడు. తన కూతరు అప్పుడే నిద్ర నుంచి లేచింది. ఆమె కళ్లెదుటే ఆ దారుణం చోటుచేసుకోగా కూతురు భయపడిపోయింది. ఏడవడం మొదలు పెట్టిన వారిద్దరిని ఇంట్లో గడియ పెట్టి భయటకు వెళ్లి పారిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

    కందుకూరు మండలం దాసర్లపల్లికి చెందిన ఎర్గమోని మహేందర్‌(35) అదే మండలంలోని మీర్‌ఖాన్‌పేటకు చెందిన సారమ్మ అలియాస్‌ స్వరూప(33)ను 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జస్వంత్‌(13), కూతురు తేజ(10) ఉన్నారు. మహేందర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, సారమ్మ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మహేందర్ తరచూ మద్యం తాగి వచ్చి గొడవలు పెట్టుకోవడంతో సారమ్మ రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసంది. అప్పడు అతడిని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కానీ తర్వాత అతడిలో మార్పు రాలేదు. మళ్లీ అదే తంతు మొదలైంది. ఓ రోజు రాత్రి సమయంలో బాగా తాగి వచ్చిన మహేందర్ నిద్రిస్తున్న భార్యపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. తన కూతురు ఎదుటే ఈ ఘాతుకానికి తెగించాడు.

    అనంతరం వారిని రూం లో బంధించి భయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. పిల్లలు అరుపులు విన్న ఇరుగుపొరుగు రావడంతో విషయం తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అదించడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. గ్రామ సమీపంలో ని ఓ వ్యవసాయ పొలం వద్ద బైక్ ని బయట పార్క్ చేసి అక్కడ నుంచి ఓ కిలోమీటరు దూరంలోని ఓ మామిడి తోటలో మహేందర్ దాక్కున్నాడు. ద్విచక్ర వాహనం చూసి గమనించిన గ్రామస్తులు చుట్టు పక్కల వెతకగా మామిడితోట పొదల్లో కనిపించాడు. గ్రామస్థులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు