మందు కోసం ‘100’కు ఫోన్ చేసి... పోలీసులు వచ్చాక

డయల్ 100కు ఫోన్ చేసిన సదరు వ్యక్తి ఓ బెల్ట్ షాప్ లో కూర్చొని దర్జాగా మందు కొడుతున్నాడు.

news18-telugu
Updated: August 4, 2019, 10:10 AM IST
మందు కోసం ‘100’కు ఫోన్ చేసి... పోలీసులు వచ్చాక
మందు కోసం వందకు ఫోన్
  • Share this:
మందు కోసం 'వంద' కు ఫోన్ చేశాడు ఓ ఘనుడు. తాను అపాయంలో ఉన్నానంటూ ఓ వ్యక్తి 100 కు డయల్ చేశాడు. దీంతో ఆ సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఆ వ్యక్తి ఉన్న చోటుకు వెళ్లారు పోలీసులు. ఏంటి ప్రాబ్లం అంటూ అక్కడ ఫోన్ చేసిన వ్యక్తిని అడిగాడు కానిస్టేబుల్. మందు కావాలంటూ దర్జాగా సెలవిచ్చాడా మందుబాబు. దీంతో కానిస్టేబుల్ కాస్త ఖంగుతిన్నాడు. ఇదంతా ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

అప్పటికే డయల్ 100కు ఫోన్ చేసిన వ్యక్తి ఓ బెల్ట్ షాప్ లో కూర్చొని దర్జాగా మందు కొడుతున్నాడు. వార్డు మెంబర్ అయిన ఓ మహిళ బెల్ట్ షాప్ నడుపుతున్నదనీ పోలీస్‌కు ఫిర్యాదు కూడా చేశాడు.  పైగా డబ్బు డిమాండ్ చేస్తోందంటూ ఆ దుకాణం నిర్వాహకురాలిపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో కానిస్టేబుల్ కాస్త కన్ ఫ్యూజ్ మందుబాబు మద్యం మత్తులో చేసిన పనికి ఏం చేయాలో అర్థంకాక సతమతమయ్యాడు.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>