news18-telugu
Updated: January 19, 2020, 7:45 AM IST
ప్రతీకాత్మకచిత్రం
హైదరాబాద్లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మందుబాబుల కిక్ దించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 32మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. 16 బైకులు, 16 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి పట్టుబడ్డవారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు పోలీసులు.
Published by:
Sulthana Begum Shaik
First published:
January 19, 2020, 7:45 AM IST