రోడ్డు ప్రమాదంలో నలుగురు బీటెక్ విద్యార్థులు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులోరోడ్డు ప్రమాదం జరిగింది. బొమ్మల రామారం నుండి నాగినేని పాల్లి వెళ్లే మార్గం లో మూల మలుపు దగ్గర హోండా ఆక్సన్ట్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పడటంతో ముగ్గురు అక్కడికక్కడ ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో స్టూడెంట్ చనిపోయాడు.మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.
ప్రమాదానికి గురైన విద్యార్థులు హైద్రాబాద్ ఇబ్రహీంపట్నం శ్రీహిందూ కళాశాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా బొమ్మల రామారంలోని పెట్రోల్ బంకు ఆవరణలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పొద్దు పోయే వరకు పార్టీ చేసుకొని ఆ తర్వాత కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన విద్యార్థులు కుంట్లూరు కు చెందిన మనీష్ రెడ్డి,చంపాపేట్ కు చెందిన వినిత్ రెడ్డి లు ఇద్దరిని 108 లో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే వినీత్ మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు.
మృతి చెందిన మరో ముగ్గురు కొత్తాపెట్ కు చెందిన స్ఫూర్తి(22), చాదర్గాట్ కు చెందిన ప్రణీత(22),చంపాపేట్ ప్రగతి నగర్ కు చెందిన చైతన్య (23)గా గుర్తించారు. మంగళవారం కాలేజీ పరీక్షలు అయిపోవడంతో బొమ్మల రామారంలోని ఓ ప్రైవేటు ఫార్మ్ హౌస్ ను లీజుకు తీసుకుని జల్సా చేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. నల్గొండ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కుమారుడు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలిపాడు. తనకు తెలియకుండా ఫార్మ్ హౌస్ లో ఉన్న సమయంలో తనకారును సెల్ ఫోన్ చార్జర్ తెస్తానని చెప్పకుండా వెళ్లారన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృత దేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Nalgonda, Telangana News