గుజరాత్ (gujarat) లో ఎన్నికలు జరుగుతున్న వేళ కలకలం రేగింది. ఎన్నికల వేళ పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం ఇప్పుడు సంచలనంగా మారింది. వడోదరలోని ఓ చిన్న ఫ్యాక్టరీలో రూ.478 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మెఫిడ్రోన్ డ్రగ్స్, ముడిపదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు అరెస్ట్..యంత్రాలు స్వాధీనం..
కాగా వడోదర శివారులోని ఓ చిన్న ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ చేస్తున్నారన్న సమాచారం ఐటియస్ కు అందింది. దీనితో రంగంలోకి దిగిన అధికారులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఈ దాడిలో పెద్ద ఎత్తున మెఫిడ్రోన్ డ్రగ్స్, ముడిపదార్ధాలు దానికి సంబంధించిన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ తయారీని వీళ్ళు డార్క్ వెబ్ సైట్ ద్వారా నేర్చుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇక గుజరాత్ ఎన్నికలు (gujarat assembly elections) రెండు విడతల్లో జరపనున్నారు. నేడు తొలి విడతలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. తొలి దశలో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు ఉండగా.. 339 మంది స్వతంత్ర అభ్యర్ధులున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయగా తొలి దశలో 2,39,76,670 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు 34.48, 3 గంటల వరకు 48.48 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూమ్ నగర్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో జడేజా (Ravindra Jadeja) ఓటు వేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలింగ్ లో పాల్గొనాలని జడేజా (Ravindra Jadeja) పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.