Home /News /crime /

DRUGS SUPPLY TO EUROPE IN PET FOOD PACKETS ONE AND HALF TONNES HEROIN SEIZED IN ABU DHABI SNR

Drugs:పెట్ ఫుడ్‌ ప్యాకెట్లో హెరాయిన్..టన్నున్నర సరుకు పోలీసులు పట్టుకుపాయె

(టన్నున్నర హెరాయిన్ సీజ్)

(టన్నున్నర హెరాయిన్ సీజ్)

Drugs Mafia: అబుదాబిలో 1.5టన్నుల హెరాయిన్‌ని అధికారులు పట్టుకున్నారు. పెంపుడు కుక్కల ఆహార ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి ఐరోపాకు ఎగుమతి చేస్తుండగా స్వాదీనం చేస్తున్నారు అబుదాబీ పోలీసులు. పట్టుబడిన హెరాయిన్ విలువ కొన్నివేల కోట్లు చేస్తుందని అంచనా.

ఇంకా చదవండి ...
ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ వాడకం, అమ్మకం, సప్లై ఏమాత్రం తగ్గడం లేదు. ఏ స్థాయిలో నిఘా పెట్టినా, ఎన్ని చోట్ల పట్టుకుంటున్నప్పటికి అధికారుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా జరుగుతూనే ఉంది. అబుదాబిలో భారీ మొత్తంలో హెరాయిన్‌ పట్టుబడింది. అత్యంత ప్రమాదకరమైన నిషేదిత డ్రగ్స్ గుట్టుచప్పుడు కాకుండా వేరే దేశాలకు తరలిస్తున్నట్లుగా గుర్తించిన అబుదాబి( Abu Dhabi)పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్‌, కస్టమ్స్‌ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 1.5 టన్ను (one and half tonnes)బరువు కలిగిన హెరాయిన్‌ని (Heroin)అబుదాబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్‌ని అనుమానం రాకుండా సప్లై చేసేందుకు సరైన మార్గం ఎంచుకున్నారు స్మగ్లర్లు. పెంపుడు కుక్కలకు పెట్టే ఆహార పదార్ధాల సంచుల్లో (Pet food packets)హెరాయిన్‌ని ప్యాక్ చేసి ఐరోపా దేశానికి ఎగుమతి చేసేందుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న టన్నున్నర హెరాయిన్ విలువ ఇండియన్‌ కరెన్సీ ప్రకారం 3 బిలియన్ 70మిలియన్ 368 వేల రూపాయలు(3 Billion 70Million 368 Thousand Rupees).అబుదాబిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి కావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. పట్టుబడిన హెరాయన్‌ని ఖలీఫా పోర్ట్‌కు వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లుగా యాంటీ నార్కోటిక్స్ బృందం ఇచ్చిన సమాచారంతో అబుదాబి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి ఖలీఫా పోర్ట్‌కు చేరుకొని అక్కడ పెంపుడు జంతువుల ఆహార పదార్ధాల ప్యాకెట్‌లో అక్రమంగా తరలిస్తున్న పెద్ద పెద్ద సంచుల్లో హెరాయిన్‌ని గుర్తించినట్లుగా అబుదాబి పోలీస్ కమాండర్ ఫారిస్ ఖలాఫ్ అల్ మజ్రూయి తెలిపారు.

టన్నుల్లో డ్రగ్స్ సీజ్..
పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని ఐరోపా దేశానికి పంపుతున్నట్లుగా తెలుసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకున్న వ్యక్తికి సప్లై చేసేందుకు ట్రక్కులో ఖలీఫా పోర్ట్‌కు తరలిస్తుండగా ఫాలో అయ్యారు పోలీసులు. అక్కడే హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అబుదాబి కస్టమ్స్ అధికారుల సహకారంతో డ్రగ్స్‌ మాఫియాకు చెక్ పెట్టామని అబుదాబి పోలీస్ కమాండ్ అల్ మజ్రోయి తెలిపారు. ఇకపై కూడా క్రిమినల్ గ్యాంగ్‌లను అరికట్టడంతోపాటు ప్రజలకు రక్షణ కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.

వేల కోట్ల విలువ చేస్తుంది..
గతేడాది కూడా అబుదాబిలో పోలీసులు 1.2 బిలియన్ల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత డ్రగ్స్‌ మాఫియాకు చెక్‌ పెట్టాలన్న లక్ష్యంతోనే అధికారులు గతేడాది మొత్తంలో 2.6 టన్నుల మత్తుపదార్థాలు, 1.4 మిలియన్ టాబ్లెట్‌లను వేర్వేరు దాడుల్లో పట్టుకోవడం జరిగింది. ఇకపై అబుదాబీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, అక్రమంగా డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే అమన్‌ సేవ 8002626 నెంబర్‌కి సమాచారం అందించి డ్రగ్స్‌ కట్టడి చేయడానికి సహకారం అందించాలని సూచించారు. తమకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచుతామని వారికి రక్షణ  కల్పిస్తామన్నారు అబుదాబి పోలీసులు.
Published by:Siva Nanduri
First published:

Tags: Drugs racket, Dubai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు